Chiranjeevi : కృష్ణవంశీ కోసం కవిత్వాలు చదువుతున్న మెగాస్టార్..

తాజాగా ఈ సినిమాకి చిరంజీవి వాయిస్ ఓవర్ అందించనున్నారు. ఇటీవల చిరంజీవి పలు సినిమాలకి వాయిస్ ఓవర్ ఇచ్చారు. మరి దీంట్లో స్పెషల్ ఏముంది, ఇది కూడా అన్నిటిలాగే అనుకుంటున్నారా.................

Chiranjeevi : కృష్ణవంశీ కోసం కవిత్వాలు చదువుతున్న మెగాస్టార్..

Rangamarthanda :  చాలా గ్యాప్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాతో రాబోతున్నారు. మరాఠి సినిమా నటసామ్రాట్ కి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ప్ర‌కాశ్ రాజ్‌, ర‌మ్య‌కృష్ణ‌, అన‌సూయ, బ్ర‌హ్మానందం, శివాత్మిక రాజ‌శేఖ‌ర్, రాహుల్ సిప్లిగంజ్.. ఇత‌ర నటీన‌టులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ అవ్వగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉంది.

తాజాగా రంగమార్తాండ సినిమాకి చిరంజీవి వాయిస్ ఓవర్ అందించనున్నారు. ఇటీవల చిరంజీవి పలు సినిమాలకి వాయిస్ ఓవర్ ఇచ్చారు. మరి దీంట్లో స్పెషల్ ఏముంది, ఇది కూడా అన్నిటిలాగే అనుకుంటున్నారా అస్సలు కాదు. ఈ సినిమాకి రెగ్యులర్ వాయిస్ తో పటు తెలుగు కవితలు కూడా బ్యాక్ గ్రౌండ్ లో వినిపించనున్నారు చిరంజీవి. అలాగే చిన్న చిన్న పాటల బిట్లు కూడా పాడనున్నారు. రెగ్యులర్ వాయిస్ ఓవర్ కంటే కొత్త‌గా, మరింత ప్రభావవంతంగా ఉండేలా, కథలోని భావోద్వేగ‌పూరిత‌మైన సన్నివేశాలని సృశించేలా చిరు వాయిస్ ఓవ‌ర్ ఉండ‌బోతుందని సమాచారం.

Amitabh Bachchan : హైదరాబాద్ మెట్రోలో అమితాబ్.. ప్రాజెక్టు K షూటింగ్..

దీంతో ఈ సినిమాకి మరింత హైప్ రానుంది. చిరంజీవి కవితలు ఎలా వినిపించనున్నారో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా ఈ సంవత్సరం చివర్లో రిలీజ్ అవ్వనుంది.