Beast: దక్షణాది అన్ని భాషల్లో ‘బీస్ట్’.. హిందీలో మాత్రం ‘రా’.. ఎందుకిలా?

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి, బుట్టబొమ్మ పూజ హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కామెడీ యాక్షన్ థ్రిల్లర్ ‘బీస్ట్’. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్..

Beast: దక్షణాది అన్ని భాషల్లో ‘బీస్ట్’.. హిందీలో మాత్రం ‘రా’.. ఎందుకిలా?

Beast(1)

Beast: తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి, బుట్టబొమ్మ పూజ హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కామెడీ యాక్షన్ థ్రిల్లర్ ‘బీస్ట్’. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 13న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన అప్డేట్స్ అన్నీ సినిమాపై ఎక్కడలేని భారీ అంచనాలను పెంచేశాయి. ముఖ్యంగా వాలంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘అరబిక్ కుతు’ లిరికల్ వీడియో సాంగ్ అయితే యూట్యూబ్‌ను షేక్ చేసేసింది.

Beast: కేజీఎఫ్-2తో యుద్ధానికి సిద్ధమైన బీస్ట్!

కాగా.. ఇప్పుడు బీస్ట్ మేకర్స్ నుండి మరో బ్లాస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ చేయనున్నారు. దక్షణాది నుండి స్టార్ హీరోల సినిమాలన్నీ కుదిరితే పాన్ ఇండియా స్థాయిలోనే విడుదల చేస్తున్న నేపథ్యంలో బీస్ట్ మేకర్స్ కూడా ఇదే ప్లాన్ చేసినట్లుగా కనిపిస్తుంది. దక్షణాది అన్ని బాషలతో పాటు హిందీలో కూడా బీస్ట్ సినిమా రిలీజ్ చేయనున్నట్లు శనివారం మేకర్స్ ప్రకటించారు. అయితే.. మిగతా అన్ని బాషలలో బీస్ట్ పేరుతోనే రిలీజ్ చేయనుండగా హిందీలో మాత్రం రా (Raw) అని పేరు మార్చారు.

Beast : భారీ ధరకి విజయ్ ‘బీస్ట్’ తెలుగు రైట్స్

విజయ్ సినిమాలలో గతంలో మాస్టర్ సినిమా కూడా ప్లాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయగా మంచి రిజల్ట్ వచ్చింది. దీంతో ఇప్పుడు ఈ సినిమా కూడా అలాగే రిలీజ్ చేస్తున్నారు. అయితే.. పేరు మార్చి ఎందుకు రిలీజ్ చేస్తున్నారన్నది ఆసక్తిగా మారింది. గతంలో తమిళ సినిమాలన్నీ తెలుగులో కూడా పేర్లు మార్చి రిలీజ్ చేసేవాళ్ళు. కానీ ఈ మధ్య కాలంలో అదే పేరుతో విడుదల చేస్తున్నారు. మన తెలుగు సినిమాలు కూడా హిందీలో అలాగే రిలీజ్ చేస్తారు. అందుకే విజయ్ కూడా బీస్ట్ పేరు మార్చి రా (Raw) పేరుతో రిలీజ్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది.