DJ Tillu : ‘ఐటం రాజా.. క్రేజీ రోజా’.. అనిరుధ్ మరో చార్ట్ బస్టర్..

‘డీజే టిల్లు’ మూవీలో అనిరుధ్ పాడిన ‘పటాస్ పిల్లా’ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది..

DJ Tillu : ‘ఐటం రాజా.. క్రేజీ రోజా’.. అనిరుధ్ మరో చార్ట్ బస్టర్..

Dj Tillu

DJ Tillu: సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ తో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘డీజే టిల్లు’.. ప్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రా శ్రీనివాస్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. విమల్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. సిద్ధు, కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తుండడం విశేషం.

Jayaram : కరోనా బారిన పడిన ప్రముఖ నటుడు జయరామ్..

‘‘రాజా రాజా ఐటం రాజా.. రోజా రోజా క్రేజీ రోజా.. పటాస్ పిల్లా పటాస్ పిల్లా’’ అనే బ్యూటిఫుల్ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. శ్రీచరణ్ పాకాల స్వరాలను సమకూర్చగా.. కిట్టు విస్సాప్రగడ లిరిక్స్ రాశారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ చక్కగా పాడారు.

Bhama Kalapaam : ‘అనుపమ’.. చాలా డేంజరస్ హౌస్ వైఫ్..

ఈ సందర్భంగా గీత రచయిత కిట్టు విస్సా ప్రగడ మాట్లాడుతూ.. ‘శ్రీ చరణ్ ముందు పల్లవి వరకు ట్యూన్ పంపారు. అది విన్నప్పుడు హుక్ లైన్ దగ్గర ‘పటాసు పిల్లా‘ అనే పదం తట్టింది. అదే మాట దర్శకుడి తో పాటూ అందరికీ నచ్చింది. తర్వాత దర్శకుడి దగ్గర పాట సందర్భం తెలుసుకుని దాని చుట్టూ పాట అల్లుకుంటూ వచ్చాను. పాటలో ఎలాంటి సన్నివేశాలు ఉంటాయో విమల్ నాకు చాలా వివరంగా కళ్ళకి కట్టినట్టు రాసి పంపారు. దాని వల్ల కొత్త రకం పోలికలు వాడటం సాధ్యపడింది. నేను శ్రీ చరణ్‌కి దాదాపు ముప్పై పాటల వరకూ రాసి ఉన్నాను. అతనితో పని ఎలా ఉంటుందో తెలిసిన అనుభవం వల్ల ఇంకాస్త త్వరగా పాట పూర్తయ్యింది. ఈ కష్టానికి అనిరుధ్ గొంతు తోడైతే పాట మరో స్థాయికి వెళ్తుందని నమ్మకం కలిగింది. టీం అందరికీ పాట నచ్చడంతో విడుదలయ్యాక ప్రేక్షకులకి కూడా బాగా నచ్చుతుంది అనే నమ్మకంతో ఉన్నాను’’ అన్నారు.