Bhama Kalapaam : ‘అనుపమ’.. చాలా డేంజరస్ హౌస్ వైఫ్..

ప్రియమణి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘భామా కలాపం’ టీజర్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించడంతో పాటు సినిమా మీద అంచనాలు పెంచేసింది..

Bhama Kalapaam : ‘అనుపమ’.. చాలా డేంజరస్ హౌస్ వైఫ్..

Bhama Kalapaam

Updated On : January 23, 2022 / 5:45 PM IST

Bhama Kalapaam: బ్లాక్‌బస్టర్ మూవీస్, అదిరిపోయే టాక్ షోస్, థ్రిల్లింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌తో మరే ఓటీటీ కూడా ఇవ్వలేని ఎండ్‌లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’. ప్రేక్షకులకు వినోదాన్నందించే విషయంలో ఎప్పటికప్పుడు తనతో తానే పోటీ పడుతూ తనకు తానే సాటిగా నిరూపించుకుంటున్న ‘ఆహా ఇప్పుడు మరో డిఫరెంట్ థ్రిల్లర్‌ను తమ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది.

Arjuna Phalguna : ‘ఆహా’ లో ‘అర్జున ఫల్గుణ’.. ఎప్పుడంటే..

ప్రియమణి ప్రధాన పాత్రలో, డైరెక్టర్ భరత్ కమ్మ (డియర్ కామ్రేడ్) సమర్పణలో, అభిమన్యు దర్శకత్వంలో, SVCC Digital బ్యానర్ మీద భోగవల్లి బాపినీడు, ఈదర సుధీర్ నిర్మిస్తున్న ఫిలిం.. ‘భామా కలాపం’ (A Delicious Home Cooked Thriller) ట్యాగ్ లైన్. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ ఆకట్టుకుంది.

Unstoppable with NBK: సెటైర్స్ కే బాప్ అంట కదా మహేష్.. ప్రోమో వచ్చేసింది!

ఆదివారం ‘భామా కలాపం’ మరో టీజర్ విడుదల చేశారు. ‘నేషనల్ క్రష్’ రష్మిక మందన్న ఈ టీజర్ లాంచ్ చేసి టీంకి బెస్ట్ విషెస్ చెప్పారు. టీజర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించడంతో పాటు సినిమా మీద అంచనాలు పెంచేసింది. పక్క ఇళ్లల్లో జరిగే వ్యవహారల మీద ఆసక్తి చూపించే అనుపమ క్యారెక్టర్‌లో ప్రియమణి అలరించింది. విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. ఫిబ్రవరి 11 నుండి ‘ఆహా’ లో ‘భామా కలాపం’ స్ట్రీమింగ్ కానుంది.