Unstoppable with NBK: సెటైర్స్ కే బాప్ అంట కదా మహేష్.. ప్రోమో వచ్చేసింది!

నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండతో థియేటర్లను, బాక్సాఫీస్ ను దద్దరిల్లేలా చేసి.. అదే ఊపులో డిజిటల్ లో కూడా దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే.

Unstoppable with NBK: సెటైర్స్ కే బాప్ అంట కదా మహేష్.. ప్రోమో వచ్చేసింది!

Unstoppable With Nbk

Updated On : January 21, 2022 / 8:00 PM IST

Unstoppable with NBK: నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండతో థియేటర్లను, బాక్సాఫీస్ ను దద్దరిల్లేలా చేసి.. అదే ఊపులో డిజిటల్ లో కూడా దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. అచ్చ తెలుగు ఓటీటీగా పేరు తెచ్చుకున్న ఆహా.. బాలయ్యతో అన్ స్టాపబుల్ షో ప్రకటన నుండి ప్రతి ఎపిసోడ్ వేరే లెవెల్ లోనే సెట్ చేస్తుంది. బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్.. టైటిల్ కి యాప్ట్ అయ్యేలా ఎనర్జీకి మ్యాచ్ అయ్యేలా అన్ స్టాపబుల్ షోతో అదరగొడుతున్నారు బాలయ్య.

RRR: క్రేజీ అప్డేట్.. ఆర్ఆర్ఆర్ కొత్త రిలీజ్ డేట్ ఇదే!

స్టార్ హీరోలతో బ్యాక్ టూ బ్యాక్ ఎపిసోడ్స్ రెడీ చేస్తున్న బాలయ్య.. ఈ సీజన్ చివరి ఎపిసోడ్ ను సూపర్ స్టార్ మహేష్ బాబుతో కంప్లీట్ చేయనున్నాడు. ప్రేక్షకులు, అభిమానులు ఈ లాస్ట్ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. తాజాగా మహేష్ బాబు బాలయ్యబాబు కలిసి వచ్చే ఎపిసోడ్ డేట్ ని అనౌన్స్ చేశారు ఆహా టీం. ఫిబ్రవరి 4న ‘Unstoppable with NBK’ లాస్ట్ ఎపిసోడ్ ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవ్వనుంది.

Lakaram Tank Bund: ఖమ్మంలో ఎన్టీఆర్‌ విగ్రహం.. ఆవిష్కరణకు జూనియర్?

తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమో విడుదల చేయగా అందులో బాలయ్య-మహేష్ టైమింగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. సెటైర్స్ కే బాప్ అంట కదా అని బాలయ్య మహేష్ ను అడిగితే సిగ్గుపడిన మహేష్ ప్రోమో లాస్ట్ వేసిన పంచ్ కి బాలయ్య.. ఇదే ఇదే కావాల్సింది.. దాచాం చాలా వస్తాయ్ అంటూ సందడి చేశారు. ప్రోమోనే ఇలా ఉంటే.. ఎపిసోడ్ ఎలా ఉంటుందోనని ఈ ఇద్దరి హీరోల అభిమానులు, ప్రేక్షకులు అంతా ఈ ఎపిసోడ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.