Pawan Kalyan : రిపబ్లిక్ డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ సినిమా?? 

'రిపబ్లిక్' సినిమా చూసి సినీ, రాజకీయ ప్రముఖులు సినిమా గురించి, దేవా కట్టా గురించి ప్రశంశిస్తున్నారు. ఇలాంటి కథతో దేవా కట్టా కమర్షియల్ గా కూడా విజయం సాధించాడు. 'రిపబ్లిక్' సినిమా

Pawan Kalyan : రిపబ్లిక్ డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ సినిమా?? 

Pk

Pawan Kalyan :  ‘ప్రస్థానం’ సినిమాతో తనకంటూ ఒక మార్క్ ని సెట్ చేసుకున్నాడు డైరెక్టర్ దేవా కట్టా. తీసింది తక్కువ సినిమాలైనా ఒక ఇంపాక్ట్ ని క్రియేట్ చేశాడు. తన సినిమాల్లో సామాజిక సమస్యలపై స్పందిస్తాడు. సమాజంలో జరిగే వాటిని కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాడు. తాజాగా సాయి ధరమ్ తేజ్ తో ‘రిపబ్లిక్’ సినిమా తీసి భారీ విజయం సాధించాడు. ఈ సినిమాలో కూడా సమాజం, సమస్యల గురించి మాట్లాడాడు. రిపబ్లిక్ తో మరోసారి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు.

పవన్ కళ్యాణ్ గురించి మన అందరికి తెలిసిందే. సమాజంలోని సమస్యల్ని ధైర్యంగా ప్రశ్నిస్తారు. వాటి గురించి మాట్లాడతారు. అంతే కాక తన సినిమాల్లో కూడా ఆ అంశాలు ఉండేలా చూసుకుంటాడు. ఇటీవల ‘రిపబ్లిక్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా పవన్ కళ్యాణ్ ఈ సినిమా గురించి, ‘ప్రస్థానం’ గురించి, దేవకట్టా గురించి గొప్పగా మాట్లాడారు. ప్రజా సమస్యలపై మాట్లాడిన వారిని పవన్ ఎప్పుడూ సపోర్ట్ చేస్తాడు. అంతే కాక తన సినిమాలకి హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా డైరెక్టర్స్ కి అవకాశాలు ఇస్తాడు పవన్. తాజాగా ‘రిపబ్లిక్’ డైరెక్టర్ దేవా కట్టాకి కూడా కూడా పవన్ అవకాశం ఇవ్వబోతున్నట్లు సమాచారం.

Chiranjeevi : ‘మా’ ఎలక్షన్స్ పై చిరంజీవి సీరియస్

‘రిపబ్లిక్’ సినిమా చూసి సినీ, రాజకీయ ప్రముఖులు సినిమా గురించి, దేవా కట్టా గురించి ప్రశంశిస్తున్నారు. ఇలాంటి కథతో దేవా కట్టా కమర్షియల్ గా కూడా విజయం సాధించాడు. ‘రిపబ్లిక్’ సినిమా చూసిన తర్వాత పవన్‌ కళ్యాణ్‌ కూడా ఫిదా అయిపోయాడు. దేవా కట్టాతో పిలిచి మరీ సినిమా గురించి మాట్లాడాడు పవన్. దేవా కట్టా పవన్ తో సినిమా అడిగాడని సమాజానికి పనికొచ్చే ఇలాంటి మంచి కథ ఉంటే కలిసి పని చేద్దామని పవన్ మాట ఇచ్చాడని సమాచారం. దీంతో దేవా కట్టా పవన్ ఇమేజ్‌కు సరిపోయేటట్లు సామాజిక అంశాలను స్పృశిస్తూ, కమర్షియల్ అంశాలు జోడించి ఒక కథ సిద్ధం చేయబోతున్నాడు. ప్రస్తుతం పవన్ నాలుగు సినిమాలు చేస్తున్నాడు. ఇవి అయ్యాక ఈ సినిమా ఉండబోతుంది. దాంతో దేవా కట్టా – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ చూడాలి అంటే కొంచెం టైం పడుతుంది. సమాజంలోని సమస్యలపై ప్రశ్నించే పవన్, సమాజంపై సినిమాలు తీసే దేవా కట్టా కలిసి సినిమా తీస్తే అది ఏ రేంజ్ లో ఉంటుందో మనమే ఊహించుకోవాలి.