Chiranjeevi : ‘మా’ ఎలక్షన్స్ పై చిరంజీవి సీరియస్

ప్రచార హోరు జనరల్ ఎలక్షన్స్ ని మించిపోయింది. ఈ వ్యవహారం అంతా చూసి కొంతమంది స్టార్ హీరోలు, సీనియర్ హీరోలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది స్టార్ హీరోలు అయితే ఈ ఎలక్షన్స్ కి

Chiranjeevi : ‘మా’ ఎలక్షన్స్ పై చిరంజీవి సీరియస్

Chiru

Chiranjeevi :  ఈ సారి ‘మా’ ఎన్నికల ప్రచారాలు మంచి రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్స్ రోజు రోజుకి ప్రచార హోరు పెంచుతున్నారు. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలు వ్యక్తిగత దూషణలు దాటి ఫిర్యాదుల వరకు వెళ్లాయి. రోజు రోజుకి వారి స్థాయిని మరిచి మరీ విమర్శలు చేస్తున్నారు. మీడియా ముందుకు వచ్చి తమ గురించి తామే డబ్బా కొట్టుకోవడం, మిగిలిన వాళ్ల‌పై విమర్శల వర్షం కురిపించడం జరుగుతుంది. అక్టోబ‌ర్ 10న ఈ ఎన్నికలు జరగనున్నాయి. మరో రెండు రోజులు మాత్రమే టైం ఉండటంతో ప్రచార హోరు జనరల్ ఎలక్షన్స్ ని మించిపోయింది. ఈ వ్యవహారం అంతా చూసి కొంతమంది స్టార్ హీరోలు, సీనియర్ హీరోలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది స్టార్ హీరోలు అయితే ఈ ఎలక్షన్స్ కి రామని కూడా చెప్పినట్టు సమాచారం. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యారు.

Bigg Boss 5 : ఈ సారి బిగ్ బాస్ కెప్టెన్ ఎవరు??

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌కాశ్ రాజ్ ప్యానెల్‌ను స‌పోర్ట్ చేస్తున్నట్టు అందరికి తెలిసిందే. చిరంజీవి తరపున నాగబాబు వచ్చి అన్ని ప్రెస్ మీట్స్ లోను ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ గా మాట్లాడుతున్నాడు. ఇక మంచు విష్ణు ప్యానెల్‌కు బాల‌కృష్ణ‌, కృష్ణంరాజు, కృష్ణ లాంటి సీనియ‌ర హీరోల స‌పోర్ట్ ఉంది. ఈ క్ర‌మంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఈ రెండు వర్గాల మధ్య జరుగుతున్న మాటల యుద్దాన్ని చూసి చిరంజీవి కోపంగా ఉన్నారని సమాచారం. అంతే కాకుండా రెండు ప్యానెల్స్ లో కొంత మందిపై చిరంజీవి సీరియస్ అయ్యారు. మనలో మనకు జరిగే ఎన్నికల గురించి కూడా ఇంతగా విమర్శలు చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అందరూ మనవాళ్లే కాబట్టి నోరుజారి మాట్లాడొద్దని, ఇలా విమర్శలు చేసుకోవడం వల్ల పోయేది మన పరువే అని ‘మా’ సభ్యులకు మెగాస్టార్ గట్టిగానే చెప్పారని ఇండస్ట్రీ టాక్. మొత్తానికి ఈ రెండు వర్గాలపై కాస్త సీరియస్ అయ్యారు చిరంజీవి. దీంతో ఎన్నికలు పూర్తయ్యే వరకు కూడా ఏం మాట్లాడకుండా ఉండిపోవాలని మెగాస్టార్ ఫిక్స్ అయ్యాడు. ఎలక్షన్ రోజు కామ్ గా వెళ్లి తన ఓటు వేసి వచ్చేయాలని, కొన్ని రోజులు ‘మా’ అసోసియేషన్ గురించి పట్టించుకోకుండా ఉండాలని చిరు భావించినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి.