Vinodhaya Sitham: మేనల్లుడితో పవన్.. స్వీయ నిర్మాణంలో రీమేక్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. భీమ్లా నాయక్ విడుదలకి సిద్ధమవుతుండగా హరిహరవీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్..

Vinodhaya Sitham: మేనల్లుడితో పవన్.. స్వీయ నిర్మాణంలో రీమేక్?

Vinodhaya Sitham

Vinodhaya Sitham: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. భీమ్లా నాయక్ విడుదలకి సిద్ధమవుతుండగా హరిహరవీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సి ఉంది. కాగా.. ఇప్పుడు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి ఓ సినిమా చేయనున్నాడని టాక్ నడుస్తుంది.

SSMB 28: మహేష్-త్రివిక్రమ్-పూజా.. హ్యాట్రిక్ సినిమాపై భారీ అంచనాలు

రిపబ్లిక్ సినిమాతో ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకొచ్చిన సాయిధరమ్ తేజ్ ఇప్పుడు ఓ రీమేక్ లో నటించనున్నట్లు తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో విలన్‌గా అదరగొడుతూ బిజీగా మారిన తమిళ దర్శకుడు నటుడు సముద్రఖని తమిళంలో ‘వినోధాయ సిత్తం’ అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. తంబి రామయ్య, సంచిత శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని దేవుడిగా నటించాడు.

Aadavallu Meeku Joharlu: టైటిల్ సాంగ్ రిలీజ్.. దేవిశ్రీ మార్క్ కిర్రాక్ అంతే!

దేవుడు ప్రత్యక్షమై ఓ మనిషికి తన చావు గురించి ముందే చెప్పి.. అతని బరువు బాధ్యతలను ముందుగానే తీర్చేసుకోమంటే పరిస్థితి ఏంటనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఇప్పుడు ఈ సినిమా తెలుగు రీమేక్ లో సాయిధరమ్ తేజ్ నటించనుండగా.. దేవుడిగా పవన్ కనిపించనున్నాడని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాని పవన్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కనుందట.

Allu Arjun: బన్నీ కొత్త యాడ్.. మొన్న బస్ ఎక్కమని.. నేడు తినమని!

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి పవన్ కళ్యాణ్ తన సొంత బ్యానర్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై సినిమాలు చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పుడు తమిళ్ రీమేక్ ని నిర్మించడమే కాక.. మేనల్లుడు సాయి తేజ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లు ఇండస్ట్రీ టాక్. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.