Payal Rajputh : హైదరాబాద్ లో కొత్త ఇల్లు కొని సెటిల్ అయిన పాయల్

తాను హైద‌రాబాదీ అమ్మాయిగా మార‌టంపై సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నాను. ఇక్క‌డి ప్రేక్ష‌కులు త‌న‌ను ఆద‌రిస్తున్న తీరుతో ముచ్చ‌ట‌ప‌డి మ‌రింత ద‌గ్గ‌ర కావాల‌ని, ఎక్కువ సినిమాలు చేయాల‌నే

Payal Rajputh : హైదరాబాద్ లో కొత్త ఇల్లు కొని సెటిల్ అయిన పాయల్

Payal Rajput (Image:Instagram)

Payal Rajputh :  మొదటి చిత్రం ‘RX 100’ తోనే కుర్రకారు మతి పోగొట్టింది పాయల్. ఫస్ట్ సినిమాలోనే లిప్‌లాక్స్‌ తో రెచ్చిపోయింది. ఈ సినిమాతో తెలుగులో అభిమానులను బాగానే సంపాదించుకుంది. పంజాబీ సినిమాల్లో హీరోయిన్‌గా కెరీర్‌ స్టార్ట్ చేసి హిందీ సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం ముంబైలో ఉంటుంది పాయల్. షూటింగ్స్ కోసం హైదరాబాద్ వచ్చిన ప్రతి సారి హోటల్స్ లో ఉంటుంది. ముంబైలో సొంత ప్లాట్ ఉంది. ఇక్కడ కూడా ఒక సొంత ప్లాట్ ఉంటే బాగుంటుంది, ఎక్కువ ఇబ్బంది పడక్కర్లేదు అని ఆలోచించి ఇక్కడ కూడా ప్లాట్ కొనుక్కుంది.

Prakash Raj: ‘MAA’కు మూకుమ్మడి రాజీనామా.. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సంచలన నిర్ణయం

హైద‌రాబాద్‌లో ఓ ఖ‌రీదైన ఫ్లాట్‌ను కొనుక్కుందని సమాచారం. ఈ విషయంపై మాట్లాడుతూ తాను హైద‌రాబాదీ అమ్మాయిగా మార‌టంపై సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నాను. ఇక్క‌డి ప్రేక్ష‌కులు త‌న‌ను ఆద‌రిస్తున్న తీరుతో ముచ్చ‌ట‌ప‌డి మ‌రింత ద‌గ్గ‌ర కావాల‌ని, ఎక్కువ సినిమాలు చేయాల‌నే ఉద్దేశంతోనే ఇక్క‌డ ఇల్లు కొనుక్కున్నాను అని సోషల్ మీడియాలో అభిమానులకు తెలిపింది. త‌న ఫ‌ర్నిచ‌ర్‌ను ఇంకా షిఫ్ట్ చేయ‌లేద‌ని చెప్పింది. తన బాయ్‌ఫ్రెండ్ సౌర‌భ్ డింగ్రానే దగ్గరుండి డెవ‌ల‌ప‌ర్స్‌తో మాట్లాడి మంచి ఫ్లాట్ కోనుగోలు చేసి, నా అభిరుచికి త‌గ్గ‌ట్లు దాన్ని ఇంటీరియ‌ల్ వ‌ర్క్ చేసి, రిజిస్ట్రేష‌న్ కార్య‌క్ర‌మాలు అన్ని చూసుకున్నాడు అని తెలిపింది. త్వ‌ర‌లోనే హైద‌రాబాద్ ఫ్లాట్‌లోకి షిఫ్ట్ అవ్వనుందని ఈ ముద్దుగుమ్మ చెప్పింది.