PM Modi: ప్రపంచంలోని ప్రశంసనీయ వ్యక్తుల్లో ఎనిమిదో స్థానంలో ప్రధాని మోదీ

స్థానికంగా జనాల్లో పాపులారిటీ సాధించడమే అంత ఈజీ కాదు. అలాంటిది దేశంలోనే కాదు.. యావత్ ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చుకోవడం చాలా కష్టం. వరుసగా రెండోసారి ప్రధాని అయిన మోదీ ఆ గ్రేట్ ఫీట్.

PM Modi: ప్రపంచంలోని ప్రశంసనీయ వ్యక్తుల్లో ఎనిమిదో స్థానంలో ప్రధాని మోదీ

Pm Modi (2)

PM Modi: స్థానికంగా జనాల్లో పాపులారిటీ సాధించడమే అంత ఈజీ కాదు. అలాంటిది దేశంలోనే కాదు.. యావత్ ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చుకోవడం చాలా కష్టం. వరుసగా రెండోసారి ప్రధాని అయిన మోదీ ఆ గ్రేట్ ఫీట్ సాధించారు. మరోసారి సత్తా చాటి 2021 సంవత్సరానికి గానూ యువ్‌గవ్ ప్రపంచంలోనే అత్యంత ప్రశంసించదగ్గ పురుషుల జాబితాలో నరేంద్ర మోదీ 8వ స్థానం దక్కించుకున్నారు. అత్యంత ప్రశంసనీయదగ్గ పురుషుల టాప్ 20 జాబితాను విడుదల చేసింది యువ్‌గవ్.

38 దేశాలకు చెందిన 42వేల కంటే ఎక్కువ మందిని సర్వే చేసింది యు గోవ్ సంస్థ.. ఆన్‌లైన్‌ ద్వారా ఈ పోల్‌ను నిర్వహించింది. ఈ జాబితాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా వ్యాపార దిగ్గజం జాక్ మా, పోప్ ఫ్రాన్సిస్, పాకిస్తాన్ అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్‌ వంటి నాయకుల కంటే మోదీ ముందున్నారు.

…………………………………… : ఉదయాన్నే ఖర్జూరం తింటే ఉపయోగాలేంటో తెలుసా?..

ఈ జాబితాలో మొదటి ప్లేస్ లో నిలిచింది అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా. ప్రపంచంలో అత్యంత ఆరాధించే వ్యక్తిగా వరుసగా రెండో ఏడాది కూడా ఒబామానే అగ్రస్థానంలో ఉన్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మూడో స్థానంలో, ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో ​​రొనాల్డో నాలుగో స్థానంలో, జాకీ చాన్ ఐదో స్థానంలో, ఎలన్ మస్క్ ఆరో స్థానంలో, లియోనెల్ మెస్సీ ఏడో స్థానంలో, నరేంద్ర మోదీ ఎనిమిదో స్థానంలో, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ తొమ్మిదో స్థానంలో, పదో స్థానంలో చైనా వ్యాపారవేత్త జాక్ మా నిలిచారు.

ఈ జాబితాలోని ఇండియన్లలో మోదీనే నెంబర్ వన్. టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 12వ స్థానంలో, బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ 14వ స్థానంలో, అమితాబ్ బచ్చన్ 15వ స్థానంలో, విరాట్ కోహ్లి 18వ స్థానంలో నిలిచారు.

…………………………. : కాళ్లల్లో పెరుకుపోయిన కొవ్వు కరిగించే వ్యాయామాలు ఇవే…