Eating Dates : ఉదయాన్నే ఖర్జూరం తింటే ఉపయోగాలేంటో తెలుసా?..
ఉదయం పరగడుపున ఖర్జూరాలు 2-4 తినడం వల్ల శరీరానికి తగినంత శక్తి లభించి వ్యాయామం చురుగ్గా చేయవచ్చు. దీంతో అలసట, నీరసం రాకుండా చూసుకోవచ్చు.

Dates
Eating Dates : డ్రై ఫ్రూట్స్ గా చెప్పబడే వాటిలో ఖర్జూరం ఒకటి. ఈ ఆరోగ్యకరమైన పండ్లలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, క్యాన్సర్ నిరోధక, డయాబెటిక్ నిరోధక మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలతో సహా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే గుణాలున్నాయి. ఖర్జూరాలు మనకు ఎంతో శక్తిని అందిస్తాయి. వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవచ్చు. వీటిల్లో క్యాలరీలు అధికంగా ఉంటాయి. అయితే ఖర్జూరాలు తియ్యగా ఉన్నప్పటికీ వీటిని ఎక్కువగా తినలేం. అందువల్ల వీటిని తింటే బరువు పెరుగుతామన్న భయం చెందాల్సిన అవసరం లేదు. ఖర్జూరాలను తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
ఖర్జూరాల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల వీటిని రోజూ తింటే జీర్ణ సమస్యల నుంచి బయట పడవచ్చు. ముఖ్యంగా మలబద్దకం తగ్గుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అయితే ఖర్జూరాలను ఖాళీ కడుపుతో ఖర్జూరాలు తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు. ఉదయం పరగడుపున ఖర్జూరాలను తినవచ్చు. దీంతో ఉదయం శరీరానికి వేగంగా శక్తి లభిస్తుంది. ఇది మనల్ని రోజంతా యాక్టివ్‌గా ఉంచుతుంది. బద్దకం తగ్గుతుంది. రోజంతా ఉత్సాహంగా పనిచేస్తారు. మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుంది. చురుగ్గా ఉంటారు.
ఎముక ఆరోగ్యం, మెదడు ఆరోగ్యం, చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో దశాబ్దాలుగా సహజ వైద్య ప్రయోజనాల కోసం ఖర్జూరాలను వాడుతున్నారు. మలబద్ధకం, ఉదర క్యాన్సర్ ,విరేచనాలతో సహా కొన్ని ఆరోగ్య పరిస్థితులకు ఖర్జూరాలను మంచి పరిష్కారంగా చెప్పవచ్చు.
ఉదయం పరగడుపున ఖర్జూరాలు 2-4 తినడం వల్ల శరీరానికి తగినంత శక్తి లభించి వ్యాయామం చురుగ్గా చేయవచ్చు. దీంతో అలసట, నీరసం రాకుండా చూసుకోవచ్చు. ఎక్కువ సేపు వ్యాయామం చేయవచ్చు. దీంతో బరువు త్వరగా తగ్గుతారు. దీంతోపాటు ప్రేగులో పరాన్నజీవులను నాశనం చేస్తుంది, హృదయాన్ని బలోపేతం చేయడానికి, కాలేయాన్ని శుభ్రపరచడానికి, రక్తాన్ని పెంచటానికి సహాయపడుతుంది. వీటిలో ఉండే విటమిన్ సి, బి 5, ఫ్లేవనాయిడ్లు మరియు యాంటీఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
దీర్ఘకాలిక అనారోగ్యం నుండి కోలుకున్న తర్వాత శరీరంలోని శక్తిని పునరుద్ధరించడానికి ఖర్జూరాలు సహాయపడతాయి మరియు ముఖ నరాల పక్షవాతం రాకుండా సహాయపడుతుంది. ఉదయం పరగడుపున ఖర్జూరాలను తినడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. అయితే ఇందుకుగాను ముందు రోజు రాత్రి 2-4 ఖర్జూరాలను నీటిలో నానబెట్టాలి. వాటిని ఉదయాన్నే పరగడుపున తినాలి. దీనివల్ల మలబద్దకం సమస్య నుంచి బయట పడతారు.
ఆకలితో బాధపడకుండా రోజంతా సంతృప్తతను కలిగిస్తుంది. ఖర్జూరాలు క్రమం తప్పకుండా తింటే హృదయనాళ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది మరియు సామర్థ్యం మరియు శక్తిని పెంచుతుంది. శరీరంలో వాపులు, నొప్పులు ఉన్నవారు ఉదయం ఖర్జూరాలను తినడం వల్ల ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. అయితే విరేచనాలు, వాంతులు అవుతున్న వారు ఖర్జూరాలను తినరాదు. ఆ సమస్యలు తగ్గాక వాటిని యథావిధిగా తినవచ్చు.
ఒత్తిడి, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో ఖర్జూరాలు ఉపయోగపడతాయి. వీటిలో కొలెస్ట్రాల్ కాంపోనెంట్స్ ఉండవు, ఫైబర్ మరియు ఐరన్ అధికంగా ఉంటాయి.విటమిన్స్ బి 5 మరియు ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఖర్జూరాలలలో పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టు పెరుగుదలను మరియు మొత్తం జుట్టు ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో ముఖ్యమైనవి. ఖర్జూరాలు మీ తలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి, తద్వారా చుండ్రు మరియు జుట్టు రాలడం వంటి జుట్టు సమస్యలను తగ్గిస్తుంది.
దశాబ్దాలుగా, ఖర్జూరాలను లైంగిక బలహీనతకు పొగొట్టేందుకు వినియోగిస్తున్నారు. వీటిలో ఉండే అధిక పోషక అంశాలైన ఫ్లేవనాయిడ్ , ఎస్ట్రాడియోల్ కాంపోనెంట్స్ లు స్పెర్మ్ కౌంట్ పెంచుతాయని నమ్ముతారు. రెగ్యులర్ గా ఖర్జూరాలు తినే మహిళల్లో రొమ్ము పరిమాణాన్ని మరియు పురుషులకు వృషణ పరిమాణాన్ని పెంచడానికి సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధించడానికి ఖర్జూరాలు దోహదం చేస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి