Ponniyin Selvan 2 : పొన్నియిన్ సెల్వన్ 2కి తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ అవ్వట్లేదా? PS 1 తీసుకున్న దిల్ రాజు కూడా వదిలేసాడా?

తెలుగులో పొన్నియిన్ సెల్వన్ 1 నెగిటివ్ టాక్ వచ్చి కలెక్షన్స్ కూడా రాలేదు. ఈ సినిమాని దిల్ రాజు భారీగా రిలీజ్ చేశాడు. ఈ సినిమాతో దిల్ రాజుకి నష్టమే మిగిలిందట. ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది. అయితే చిత్రయూనిట్ బిజినెస్................

Ponniyin Selvan 2 : పొన్నియిన్ సెల్వన్ 2కి తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ అవ్వట్లేదా? PS 1 తీసుకున్న దిల్ రాజు కూడా వదిలేసాడా?

Ponniyin Selvan 2 pre business is very poor in telugu states

Ponniyin Selvan 2 :  మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, శోభిత, ఐశ్వర్య లక్ష్మి, జయరాం.. ఇలా అనేకమంది స్టార్ కాస్ట్ తో భారీగా తెరకెక్కించిన సినిమా పొన్నియిన్ సెల్వన్. పొన్నియిన్ సెల్వన్ పుస్తకం ఆధారంగా తమిళ రాజుల చరిత్రని చూపిస్తూ గ్రాండ్ గా తీసారు ఈ సినిమాని. సినిమా రిలీజ్ కి ముందు భారీ అంచనాలు ఉన్నాయి. దీన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తామని ప్రకటించి పొన్నియిన్ సెల్వన్ 1 గతేడాది రిలీజ్ చేశారు.

 

సినిమా తమిళ్ లో హిట్ తెచ్చుకున్నా మిగిలిన చోట్ల మాత్రం అంత బాగా టాక్ రాలేదు. కొంతమంది యావరేజ్ అంటే కొంతమంది ఫ్లాప్ అన్నారు. అయితే స్టార్ కాస్ట్ ఉండటంతో కలెక్షన్స్ బాగా వచ్చి పొన్నియిన్ సెల్వన్ 1 సినిమా 400 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. చిత్రయూనిట్ మాత్రం తమిళ్ లో హిట్ అయి కలెక్షన్స్ రావడంతో సినిమాని సూపర్ హిట్ గా ప్రమోట్ చేసుకున్నారు. కానీ వేరే రాష్ట్రాల్లో మాత్రం సినిమాకి కలెక్షన్స్ అస్సలు రాలేదు కూడా.

RRR Team : రాజమౌళి, RRR టీం ఆస్కార్ వేడుకల్లో పాల్గొనడానికి 20 లక్షలు చెల్లించారా?

తెలుగులో పొన్నియిన్ సెల్వన్ 1 నెగిటివ్ టాక్ వచ్చి కలెక్షన్స్ కూడా రాలేదు. ఈ సినిమాని దిల్ రాజు భారీగా రిలీజ్ చేశాడు. ఈ సినిమాతో దిల్ రాజుకి నష్టమే మిగిలిందట. ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది. అయితే చిత్రయూనిట్ బిజినెస్ కి కష్టపడుతుందని సమాచారం. తమిళ్ లో ఎలాగైనా బిజినెస్ చేసేసినా వేరే రాష్ట్రాల్లో మాత్రం అనుకున్న అమౌంట్ కి దరిదాపుల్లో కూడా బిజినెస్ అవ్వట్లేదట. తెలుగులో అయితే మరీ దారుణంగా 10 కోట్లకు సినిమాను అడుగుతన్నారని సమాచారం. పొన్నియిన్ సెల్వన్ 1 దెబ్బ కొట్టడంతో దిల్ రాజు పొన్నియిన్ సెల్వన్ 2 వదిలేశాడని తెలుస్తోంది. మరి పొన్నియిన్ సెల్వన్ 2 ఏ రేంజ్ లో రిలీజ్ అవుతుందో, ఈ సారన్నా మెప్పిస్తుందా, తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ వస్తాయా చూడాలి.