RRR Team : రాజమౌళి, RRR టీం ఆస్కార్ వేడుకల్లో పాల్గొనడానికి 20 లక్షలు చెల్లించారా?

ఆస్కార్ వేడుకలకు కూడా రాజమౌళి అండ్ టీం ఫ్యామిలీలతో కలిసి చాలా మంది వెళ్లారు. అయితే అంతమంది వెళ్ళడానికి రాజమౌళి 20 లక్షలు ఖర్చు చేశారని టాక్ వినిపిస్తుంది. సాధారణంగా ఆస్కార్ కి నామినేట్ అయిన వాళ్ళతో పాటు............

RRR Team : రాజమౌళి, RRR టీం ఆస్కార్ వేడుకల్లో పాల్గొనడానికి 20 లక్షలు చెల్లించారా?

Rajamouli and RRR team paid 20 lakhs to participate in Oscar ceremony?

RRR Team :  RRR సినిమా నుంచి నాటు నాటు సాంగ్ ఆస్కార్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఆస్కార్ ప్రమోషన్స్ కోసం రాజమౌళి అండ్ టీం కొన్ని నెలల పాటు అమెరికాలోనే ఉండి చాలా ఖర్చు చేసి, చాలా కష్టపడి ప్రమోషన్స్ చేసి ఆస్కార్ దాకా సినిమాని తీసుకెళ్లారు. కొన్ని నెలలుగా అమెరికాలోనే ఉండి రాజమౌళి అనేక సినిమా ఈవెంట్స్ కి, అవార్డు ఫంక్షన్స్ కి వెళ్లారు.

ఇక ఆస్కార్ వేడుకలకు కూడా రాజమౌళి అండ్ టీం ఫ్యామిలీలతో కలిసి చాలా మంది వెళ్లారు. అయితే అంతమంది వెళ్ళడానికి రాజమౌళి 20 లక్షలు ఖర్చు చేశారని టాక్ వినిపిస్తుంది. సాధారణంగా ఆస్కార్ కి నామినేట్ అయిన వాళ్ళతో పాటు ఇంకొకరికి మాత్రమే ఆస్కార్ వేడుకల హాల్లోకి ఎంట్రీ ఉంటుందని, ఒకవేళ సినిమా నామినేట్ అయితే ఆ సినిమా యూనిట్ నుంచి ఇంతమంది అని లిమిట్ ఉంటుందని టాక్. దీంతో RRR సినిమా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అవ్వడంతో కీరవాణి, చంద్రబోస్ లతో పాటు మరో ఇద్దరికే హాల్లోకి ఎంట్రీ ఉందని సమాచారం.

Janhvi Kapoor : ఎన్టీఆర్ కోసమే RRR మళ్ళీ చూశాను.. ఆయనతో సినిమా ఛాన్స్ కోసం రోజూ దేవుడికి దండం పెట్టుకున్నాను..

కానీ రాజమౌళి, రాజమౌళి భార్య, రాజమౌళి తనయుడు కార్తికేయ, కీరవాణి భార్య, రామ్ చరణ్, ఉపాసన, ఎన్టీఆర్, ప్రేమ్ రక్షిత్ మాస్టర్.. ఇలా వీళ్లంతా ఆస్కార్ వేడుకలకు వెళ్లారు. రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ మాత్రం నాటు నాటు లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు కాబట్టి వారికి ఎలాగో ఎంట్రీ ఫ్రీ. దీంతో మిగిలిన వాళ్లంతా ఆస్కార్ వేడుకల హాల్లోకి వెళ్ళడానికి రాజమౌళి 25000 డాలర్లు అంటే దాదాపు 20 లక్షలు ఆస్కార్ వాళ్ళకి కట్టి లోపలికి అందరూ వెళ్లారని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై అధికారికంగా ఎవరూ స్పందించకపోయినా ఇదంతా అబద్దం అని RRR టీం సన్నిహితులు చెప్పినట్టు సమాచారం. ఆస్కార్ ప్రమోషన్స్ కోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన రాజమౌళి ఆస్కార్ వేడుకలకు అందర్నీ తీసుకెళ్లడానికి 20 లక్షలు ఖర్చు చేయలేరా అని కూడా టాక్ నడుస్తుంది. ఏది ఏమైనా RRR టీం అంతా ఆస్కార్ వేడుకలకు ఫ్యామిలీస్ తో సహా హాజరయి ఆస్కార్ సాధించి గర్వంగా తిరిగివచ్చారు.