Pooja Hegde : పూజా పాప క్రేజ్.. బన్నీతో మూడోసారి..

హాట్ బ్యూటీ పూజా హెగ్డే.. టాలీవుడ్, కోలీవుడ్ వయా బాలీవుడ్ అన్నట్లు తెగ తిరిగేస్తోంది..

Pooja Hegde : పూజా పాప క్రేజ్.. బన్నీతో మూడోసారి..

Pooja Hegde (image:Instagram)

Pooja Hegde: హాట్ బ్యూటీ పూజా హెగ్డే క్రేజ్ మామూలుగా లేదు. వరుస సినిమాలతో, బిజీ షెడ్యూల్స్‌తో సందడి చేస్తుంది. టాలీవుడ్, కోలీవుడ్ వయా బాలీవుడ్ అన్నట్లు తెగ తిరిగేస్తోంది. నాగ చైతన్య ‘ఒక లైలా కోసం’ తో తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయిన పూజా పాప.. ‘అరవింద సమేత’, ‘అల.. వైకుంఠపురములో’, ‘మహర్షి’ సినిమాలతో గోల్డెన్ లెగ్ హీరోయిన్‌గా మారిపోయింది.

మోస్ట్ వాంటెడ్ ముద్దుగుమ్మ పూజా హెగ్డే..

ప్రభాస్‌తో చేసిన ‘రాధే శ్యామ్’, అక్కినేని అఖిల్ పక్కన చేసిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమాలు రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి. ‘హౌస్ ఫుల్ 4’ తర్వాత హిందీలో.. రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కుతున్న ‘సర్కస్’ మూవీలో నటిస్తోంది. దళపతి విజయ్ ‘బీస్ట్’ ఫిలింతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.

Pooja Hegde : పూజా హెగ్డే పార్టీ స్టైలే వేరు..!

ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ పూజా ఖాతాలో వచ్చి చేరింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, వేణు శ్రీరామ్ కాంబినేషన్‌లో దిల్ రాజు నిర్మించనున్న ‘ఐకాన్’ మూవీలో హీరోయిన్‌గా పూజా పాపని ఫిక్స్ చేశారట. ‘డీజే – దువ్వాడ జగన్నాథమ్’, ‘అల.. వైకుంఠపురములో’ తర్వాత ముచ్చటగా మూడోసారి బన్నీతో జతకట్టబోతోంది పూజా హెగ్డే.

R K Selvamani : ఇది మంచిది పద్ధతి కాదు.. పూజా హెగ్డేపై రోజా భర్త ఫైర్..