Pooja Hegde : ప్రభాస్‌తో కలిసి ‘బాహుబలి 3’లో నటించాలనుంది

ఇందులో ప్రభాస్ తో మరో సారి సినిమా ఛాన్స్ వస్తే అని ప్రశ్న అడుగగా పూజ హెగ్డే మాట్లాడుతూ.. ''ప్రభాస్ తో కలిసి మరోసారి నటించాలని ఉంది. ప్రభాస్ 'బాహుబలి 3' తీస్తే అందులో ఎలాగైనా...

Pooja Hegde : ప్రభాస్‌తో కలిసి ‘బాహుబలి 3’లో నటించాలనుంది

Pooja

Pooja Hegde :  ప్రస్తుతం స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉంది పూజ. వరుసగా హిట్స్ సాధిస్తూ దూసుకుపోతుంది కెరీర్ లో. ఇటీవలే ప్రభాస్ తో జంటగా ‘రాధేశ్యామ్’ సినిమాలో కనిపించి ప్రేక్షకులని అలరించింది. ఈ సినిమా సమయంలో పూజ వరుస ప్రమోషన్స్ లో పాల్గొని పలు ఆసక్తికర విషయాలని తెలిపింది. ప్రస్తుతం బాలీవుడ్ లో షూట్ తో బిజీగా ఉన్న పూజా హెగ్డే ఇటీవల ఓ బాలీవుడ్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చింది.

ఈ ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చింది పూజ. ఇందులో ప్రభాస్ తో మరో సారి సినిమా ఛాన్స్ వస్తే అని ప్రశ్న అడుగగా పూజ హెగ్డే మాట్లాడుతూ.. ”ప్రభాస్ తో కలిసి మరోసారి నటించాలని ఉంది. ప్రభాస్ ‘బాహుబలి 3’ తీస్తే అందులో ఎలాగైనా నటించాలి అని కోరుకుంటున్నాను. ప్రభాస్ తో కలిసి ‘బాహుబలి 3’ చేయాలని ఉంది” అని తెలిపింది.

Mahesh Babu : సితార, తమన్ స్పెషల్ ఎంట్రీలుగా ‘సర్కారు వారి పాట’ సెకండ్ సాంగ్ రిలీజ్

ఇక ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ లో రాజమౌళి మాట్లాడుతూ ప్రభాస్ తో భవిష్యత్తులో ‘బాహుబలి 3’ తీసే అవకాశాలు ఉన్నాయి అని తెలిపారు. ఒకవేళ ఇదే నిజమైతే ఈ సినిమాలో పూజా హెగ్డేకి ఛాన్స్ వస్తుందో లేదో చూడాలి మరి.