Poonam Khaur : పవన్‌తో ఛాన్స్ వచ్చినా.. కావాలనే తప్పించారు..

పూనమ్ తన సినిమాలతోనే కాక తన ట్వీట్స్‌తో కూడా పాపులర్ అయింది. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా ట్వీట్స్ చేస్తూ వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గురించి........

Poonam Khaur :  పవన్‌తో ఛాన్స్ వచ్చినా.. కావాలనే తప్పించారు..

Pawan

 

Poonam Khaur :   ‘మాయాజాలం’ సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టిన హీరోయిన్ పూనమ్‌ కౌర్‌. ఆ తర్వాత కొన్ని చిన్న సినిమాల్లో హీరోయిన్‌గా, కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేసింది. 2018లో చివరి సారిగా తెలుగు సినిమాల్లో కనిపించింది. నాలుగేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న పూనమ్‌ తాజాగా ఇటీవల ‘నాతి చరామి’ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇటీవలే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది.

 

పూనమ్ తన సినిమాలతోనే కాక తన ట్వీట్స్‌తో కూడా పాపులర్ అయింది. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా ట్వీట్స్ చేస్తూ వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గురించి అప్పుడప్పుడు ట్వీట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది పూనమ్. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పూనమ్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడింది.

Samantha : డ్రెస్సింగ్ స్టైల్‌పై వచ్చిన ట్రోల్స్‌కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సమంత

పవన్ తో నటించే ఛాన్స్ రాలేదా అని ఓ విలేఖరి అడుగగా పూనమ్… ”పవన్‌తో నాకు నటించే ఛాన్స్ వచ్చింది. కానీ కొంతమంది కావాలనే పవన్ కళ్యాణ్ తో నన్ను నటించకుండా చేశారు. ఆయన గురించి పాజిటివ్‌గా చెప్పినా నెగిటివ్‌గానే అర్థం చేసుకుంటారు. అలాగే ప్రచారం చేశారు.” అంటూ తెలిపింది. పూనమ్ మరోసారి పవన్ గురించి మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అయితే పూనమ్‌ని పవన్‌తో నటించకుండా చేసిన వాళ్ళు ఎవరా అని ఆలోచిస్తున్నారు.