Samantha : డ్రెస్సింగ్ స్టైల్‌పై వచ్చిన ట్రోల్స్‌కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సమంత

సమంత ఈ ట్రోల్స్‌కి కౌంటర్‌గా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ చేసింది. సమంత తన స్టోరీలో..''ఒక మహిళగా నిర్ణయాన్ని చెప్పడం అంటే ఏంటో నాకు తెలుసు. మహిళల దుస్తులు, చదువు............

Samantha :  డ్రెస్సింగ్ స్టైల్‌పై వచ్చిన ట్రోల్స్‌కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సమంత

Samantha

Samantha :  సమంత విడాకుల తర్వాత రోజు రోజుకి మరింత రెచ్చిపోతుంది. ఫ్రీ‌బర్డ్ లాగా తనకు అడ్డే లేదన్నట్టు చేస్తుంది. ఇప్పటికే ఐటెం సాంగ్‌తో రచ్చ చేసింది సమంత. ఆ సాంగ్ సమయంలోనే సమంతని చాలా మంది ట్రోల్ చేశారు. అయినా ఆ ట్రోల్స్ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇటీవల సమంత ఒప్పుకుంటున్న యాడ్స్, సినిమాలు అన్ని చూస్తే డబ్బే ప్రధానంగా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవల ఒక ఆల్కహాల్ బ్రాండ్‌కి కూడా బోల్డ్‌గా డ్రెస్‌లు వేసుకొని యాడ్ చేయడంతో సమంత మరింత ట్రోలింగ్‌కి గురయింది.

డబ్బులు ఇస్తే ఎలాంటి యాడ్స్ అయినా చేస్తారా? డబ్బులిస్తే ఎలాంటి బట్టలు అయినా వేసుకుంటారా? అని నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు. అయినా సమంత తగ్గకుండా ఆ తర్వాత జరిగిన ఓ ఈవెంట్ కి కూడా రెచ్చిపోయి మరీ బోల్డ్‌గా డ్రెస్ వేసుకొచ్చింది. బ్యాక్ మొత్తం కనపడేలా, ఫ్రంట్ క్లివేజ్ కూడా ఎక్కువగా కనపడేలా ఓ గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకొచ్చింది. ఈ డ్రెస్‌తో ఉన్న సమంత ఫోటోలు వైరల్ అవ్వగా నెటిజన్లు సమంతని మరోసారి ట్రోల్ చేశారు.

Roshan : రెండో చిత్రాన్ని గ్రాండ్‌గా ప్లాన్ చేసిన రోషన్..

దీంతో సమంత ఈ ట్రోల్స్‌కి కౌంటర్‌గా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ చేసింది. సమంత తన స్టోరీలో..”ఒక మహిళగా నిర్ణయాన్ని చెప్పడం అంటే ఏంటో నాకు తెలుసు. మహిళల దుస్తులు, చదువు, సామాజిక స్థితి, వారి రూపురేఖలు, కలర్‌.. ఇలా ఎన్నోరకాలుగా వారిపై కామెంట్లు చేస్తూ వివక్షను చూపిస్తున్నారు. మహిళలు వేసుకునే బట్టల ఆధారంగా చాలా ఈజీగా వారిని జడ్జ్‌ చేస్తుంటారు. మనం 2022వ సంవత్సరంలో ఉన్నాం. ఇప్పటికైనా మహిళలను జడ్జ్‌ చేయడం మానరా? వారు ఎలాంటి బట్టలు వేసుకున్నారు? ఎలా కనిపిస్తున్నారనేదాన్ని బట్టే స్త్రీలను అంచనా వేయడం మానేసి మనపై మనం దృష్టి పెట్టలేమా? మీ అభిప్రాయాలను రుద్దడం వల్ల ఎవరికీ మేలు జరగదు” అంటూ పోస్ట్ చేసింది.

Kandikonda : సొంతగ్రామంలో కందికొండ అంత్యక్రియలు..

అయితే గతంలో కూడా సమంత ట్రోల్స్‌కి సమాధానంగా ఇలాంటి పోస్టులు పెట్టింది. అయినా సమంత మీద ట్రోల్స్ ఆగట్లేదు. కొంతమంది ఈ పోస్ట్‌కి కూడా వేరే హీరోయిన్స్‌ని ఎవ్వర్నీ ట్రోల్ చెయ్యట్లేదు మిమ్మల్నే ట్రోల్ చేస్తున్నారంటే మీలోనే తప్పు ఉందని, మీకు ఇష్టం ఉండి వేసుకుంటే పరవాలేదు కానీ, డబ్బుల కోసం ఇలా బట్టలు వేసుకోడం ఏంటని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఏది ఏమైనా సమంతకి మాత్రం విడాకుల తర్వాత పూర్తిగా స్వేచ్ఛ వచ్చినట్టు మాత్రం తెలుస్తుంది. కొందరైతే ఏకంగా ఇలాంటి స్వేచ్ఛ కావాలనుకున్నప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకు అని కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ట్రోల్స్ మాత్రం ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు.

Samantha : మరోసారి రెచ్చిపోయిన సమంత..