Pawan Kalyan: మరోసారి దేవుడిగా కనిపించనున్న పవర్ స్టార్?

తెలుగులో మల్టీస్టారర్ గా హిందీ నుండి రీమేక్ గా తెరకెక్కిన గోపాల గోపాల సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడిగా అలరించిన సంగతి తెలిసిందే. వెంకటేష్ దేవుడిని ద్వేషించే వ్యక్తిగా ఈ సినిమాలో..

Pawan Kalyan: మరోసారి దేవుడిగా కనిపించనున్న పవర్ స్టార్?

Pawan Kalyan

Pawan Kalyan: తెలుగులో మల్టీస్టారర్ గా హిందీ నుండి రీమేక్ గా తెరకెక్కిన గోపాల గోపాల సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడిగా అలరించిన సంగతి తెలిసిందే. వెంకటేష్ దేవుడిని ద్వేషించే వ్యక్తిగా ఈ సినిమాలో అదరగొడితే.. పవన్ దేవుడిగా తనదైన మేనరిజంతో ఆకట్టుకున్నాడు. అయితే, పవన్ మరోసారి దేవుడిగా కనిపించబోతున్నాడని ఓ కథనం టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ఈసారి తమిళ రీమేక్ కోసం పవన్ దేవుడిగా మారబోతున్నాడట. ఇది సోషియో ఫాంటసీ సినిమాగా తెరకెక్కనుందట.

Radhe Shyam: ప్రభాస్‌తో గొడవ.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పూజా వస్తుందా?

ఈ మధ్య కాలంలో విలన్‌గా అదరగొడుతూ బిజీగా మారిన తమిళ దర్శకుడు నటుడు సముద్రఖని తమిళంలో ‘వినోధాయ సిత్తం’ అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. తంబి రామయ్య, సంచిత శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని దేవుడిగా నటిస్తున్నాడు. తంబీ రామయ్య పాత్ర ఈ సినిమాలో హఠాత్తుగా మరణించి పరలోకానికి వెళ్లగా.. అక్కడ దేవుడితో తన బాధను చెప్పుకొని మూడు నెలలు పాటు మళ్ళీ భూమి మీదకి వచ్చేలా ఒప్పించి మళ్ళీ తిరిగి భూమి మీదకి వస్తాడట.

Bhala Thandanana: యాక్షన్‌లోకి దిగిన శ్రీవిష్ణు.. లుక్ అదిరిందిగా!

భూమి మీద అతనికి ఎదురైన పరిస్థితులు, తిరిగి వచ్చాక మనుషుల స్వభావం.. తనను తిరిగి మళ్ళీ పరలోకానికి తీసుకెళ్లేందుకు దేవుడి ప్రయత్నమే ఈ సినిమా. ఇందులో తమిళంలో సముద్రఖని పోషిస్తున్న దేవుడి పాత్ర కోసం తెలుగులో పవన్ కళ్యాణ్ ను సంప్రదించారట. తెలుగులో కూడా సముద్రఖనినే దర్శకత్వం వహిస్తుండగా మిగతా పాత్రల కోసం అన్వేషణ సాగుతుందట. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన కూడా వెలువడనుందని చెప్తున్నారు.