Radhe Shyam: ప్రభాస్‌తో గొడవ.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పూజా వస్తుందా?

మొత్తానికి మొదలుపెట్టారు. ఫాన్స్ సోషల్ మీడియాలో మొత్తుకుంటుంటే.. ఇన్నాళ్లకి ప్రమోషన్లు మొదలుపెట్టారు. ఎప్పుడో ఒక పోస్టర్, గుర్తొచ్చినప్పుడో సాంగ్ రిలీజ్ చేస్తున్న టీమ్..

Radhe Shyam: ప్రభాస్‌తో గొడవ.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పూజా వస్తుందా?

Radhe Shyam

మొత్తానికి మొదలుపెట్టారు. ఫాన్స్ సోషల్ మీడియాలో మొత్తుకుంటుంటే.. ఇన్నాళ్లకి ప్రమోషన్లు మొదలుపెట్టారు. ఎప్పుడో ఒక పోస్టర్, గుర్తొచ్చినప్పుడో సాంగ్ రిలీజ్ చేస్తున్న టీమ్.. ఇప్పుడిప్పుడే ఫుల్ ఫ్లెడ్జ్ ప్రమోషన్లు స్టార్ట్ చేశారు. రాధేశ్యామ్ ప్రమోషన్లు స్టార్ట్ చేశారన్న ఆనందంకంటే ప్రమోషన్లకు పూజాహెగ్డే వస్తుందా లేదా అన్న టాపిక్ మీదే ఇప్పుడు ఇంట్రస్టింగ్ గా ఉన్నారు ఫాన్స్.

Radhe Shyam: ఫ్యాన్స్‌కు పండగ రోజు.. నేడే రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్!

రాధేశ్యామ్ లైన్లోకొచ్చింది. జనవరి 14న.. అంటే రిలీజ్ కి ఇంకా 20 రోజులున్న రాధేశ్యామ్ ఇప్పుడిప్పుడే ప్రమోషన్ల స్పీడ్ పెంచుతోంది. ఇప్పటి వరకూ పాటలు, పోస్టర్లతో సరిపెట్టుకున్న ఈ పాన్ ఇండియా మూవీ.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసింది. ప్రేక్షకులే గెస్ట్ లుగా భారీగా రామోజీఫిల్మ్ సిటీలో ఈ గురువారం జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా ఉంటుంది అనే దాని కంటే అసలు ఈ ఈవెంట్ కి హీరోయిన్ అటెండ్ అవుతుందా లేదా అని ఆలోచిస్తున్నారు జనాలు.

Dhanush SIR: ఇంట్రస్టింగ్ టైటిల్.. ధనుష్ తొలి తెలుగు సినిమా ‘సార్’!

ప్రభాస్, పూజాహెగ్డే జంటగా తెరకెక్కిన రాదేశ్యామ్ అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కింది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు, సాంగ్స్ లో ఈ ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ స్క్రీన్ మీద సూపర్ గా కనిపిస్తోంది. కానీ ఆఫ్ స్క్రీన్ మాత్రం అంత లేదని, అసలు ఇద్దరికీ పెద్ద గొడవైందని, పూజాహెగ్డే లేకుండానే కొన్ని కాంబినేషన్ సీన్స్ కూడా షూట్ చేసేశారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

Radhe Shyam: రూట్ మార్చేశారు.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ హీరో హోస్టింగ్!

రాధేశ్యామ్ స్టార్టింగ్ నుంచే ప్రభాస్, పూజాహెగ్డే మధ్య ఏదో ఇష్యూ అయ్యిందని, ఇష్టం లేకుండానే కమిట్ అయ్యాం కదాని సినిమా కంప్లీట్ చేశారని అప్పట్లో వార్తలు వినిపించాయి. అంతేకాదు.. ఈ విషయం మీద క్లారిటీ కూడా ఇవ్వలేదు ఎవ్వరూ. అందుకే ఆడియన్స్ కూడా రాధేశ్యామ్ ప్రమోషన్ల్ ఈవెంట్స్ కి పూజాహెగ్డే వస్తుందా రాదా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ రాకపోయినా.. షూటింగ్ వల్ల రాలేదనో, హెల్త్ బాలేదనో ఎక్స్ క్యూజెస్ చెప్పి తప్పించేసుకుంటారేమో అని డౌట్లు కూడా వచ్చేస్తున్నాయి జనానికి.