Radhe Shyam: ఫ్యాన్స్‌కు పండగ రోజు.. నేడే రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్!

ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఓ రెండు సినిమాల కోసం సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రెండూ పాన్ ఇండియా సినిమాలే కాగా రెండూ సంక్రాంతి టార్గెట్ గా ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి

Radhe Shyam: ఫ్యాన్స్‌కు పండగ రోజు.. నేడే రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్!

Radhe Shyam

Radhe Shyam: ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఓ రెండు సినిమాల కోసం సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రెండూ పాన్ ఇండియా సినిమాలే కాగా రెండూ సంక్రాంతి టార్గెట్ గా ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఈ రెండు ఒక దానికి మించి మరొకటి భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. తెలుగు సినిమాల కోసం మన ప్రేక్షకులే కాదు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మన మేకర్స్ కూడా దేశంలోని అన్ని నగరాలను చుట్టేస్తూ అంతటా సినిమాలకి ప్రమోషన్ చేస్తున్నారు.

Dhanush SIR: ఇంట్రెస్టింగ్ టైటిల్.. ధనుష్ తొలి తెలుగు సినిమా ‘సార్’!

ఇప్పటికే ఆర్ఆర్ఆర్ ఈ ప్రమోషన్స్ విషయంలో ఫుల్ స్వింగ్ లో ఉండగా రాధేశ్యామ్ కూడా రచ్చ మొదలు పెడుతున్నాడు. ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రమోషన్స్ కూడా మొదలైన సంగతి తెలిసిందే కాగా రాధేశ్యామ్ ఈ గురువారం మొదలు పెడుతుంది. ముందుగా ఇందుకోసం హైదరాబాద్ లో నేడు భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసింది. రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న ఈ వేడుకకు కనీవినీ ఎరుగని రీతిలో జాతీయ స్థాయిలో ఏర్పాట్లు చేశారు.

Radhe Shyam: రూట్ మార్చేశారు.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ హీరో హోస్టింగ్!

ఈ గురువారం జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే రాధేశ్యామ్ ట్రైలర్ కూడా విడుదల చేయనుండడంతో ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ ట్రైలర్ వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న ఈ ఈవెంట్ కు ఫ్యాన్స్ కోసం ప్రీ పాసులు కూడా జారీ చేసిన నిర్వాహకులు భారీ సెట్టింగులు, ఓ అవార్డు వేడుక స్థాయిలో ఈ వేడుకకు ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఈ వేడుకకు ఓ యంగ్ హీరోతో హోస్టింగ్ చేయించనున్నట్లు కూడా ఇప్పటికే లీకవడంతో ఈ వేడుక ఏ స్థాయిలో ఉండనుందా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.