SPIRIT : పవర్‌ఫుల్ పోలీస్‌గా ప్రభాస్..

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ చెయ్యనున్నారు..

SPIRIT : పవర్‌ఫుల్ పోలీస్‌గా ప్రభాస్..

Prabhas 25

SPIRIT: రెబల్ స్టార్ ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా.. సాలిడ్ కాంబినేషన్ కుదిరింది. పాన్ ఇండియా స్టార్, పాన్ ఇండియన్ డైరెక్టర్‌ల కలయికలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టింది టీ-సిరీస్ సంస్థ. ప్రభాస్ కెరీర్‌లో 25వ సినిమాగా రానున్న ఈ మూవీకి ‘స్పిరిట్’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ.. అఫీషియల్‌గా పోస్టర్ రిలీజ్ చేశారు.

Prabhas 25 : క్రేజీ కాంబో.. డార్లింగ్‌తో సందీప్ ‘స్పిరిట్’..

‘అర్జున్ రెడ్డి’ తో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి.. ఆ తర్వాత అదే సినిమాను హిందీలో షాహిద్ కపూర్ హీరోగా ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా సంచలన విజయం అందుకున్నారు. ఇప్పటి వరకు రెబెల్ స్టార్ ప్రభాస్‌ను అభిమానులు కనీసం ఊహించనటువంటి కొత్త పాత్రలో సందీప్ రెడ్డి వంగా చూపించబోతున్నారు.

Prabhas : ప్రభాస్ వ్యానిటీ వ్యాన్ చూశారా..

డార్లింగ్ ఈ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్‌ క్యారెక్టర్ చెయ్యనున్నారని తెలుస్తోంది. పాన్ ఇండియన్ స్థాయిలో భారీ బడ్జెట్‌తో టీ-సిరీస్, భ‌ద్ర‌కాళీ పిక్చ‌ర్స్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ‘రాధే శ్యామ్’, ‘ఆదిపురుష్’, ‘సలార్’, ప్రాజెక్ట్-కే’ సినిమాలతో బిజీగా ఉన్నారు. సందీప్ రెడ్డి హిందీలో రణ్‌వీర్ సింగ్ హీరోగా ‘యానిమల్’ అనే సినిమా చేస్తున్నారు.

Prabhas : ప్రభాస్ బిర్యానీకి బాలీవుడ్ భామ ఫిదా..