Prabhas: మరో నెల రెస్ట్ మోడ్‌లోనే ప్రభాస్.. అసలేం జరుగుతోంది?

రాధేశ్యామ్ రిలీజ్ తర్వాత ప్రభాస్ సైలంటయ్యాడు. సినిమా రిజల్ట్ తో పాటూ పర్సనల్ ఇష్యూస్ కూడా గ్లోబల్ స్టార్ సెలెన్స్ కి కారణం. అయితే మరో నెల పాటూ కూడా డార్లింగ్ రెస్ట్ మోడ్ లోనే..

Prabhas: మరో నెల రెస్ట్ మోడ్‌లోనే ప్రభాస్.. అసలేం జరుగుతోంది?

Prabhas

Prabhas: రాధేశ్యామ్ రిలీజ్ తర్వాత ప్రభాస్ సైలంటయ్యాడు. సినిమా రిజల్ట్ తో పాటూ పర్సనల్ ఇష్యూస్ కూడా గ్లోబల్ స్టార్ సెలెన్స్ కి కారణం. అయితే మరో నెల పాటూ కూడా డార్లింగ్ రెస్ట్ మోడ్ లోనే ఉండబోతున్నారు. సలార్ సెట్స్ మీదికి ఇప్పుడప్పుడే వెళ్లకుండా గ్యాప్ తీసుకుంటున్నారు. ఎందుకీ బ్రేక్.. తీసుకున్న రెస్ట్ సరిపోలేదా.. అసలేం జరుగుతోంది..?

Prabhas : వచ్చే నెలలోనే ప్రభాస్ – మారుతి సినిమా మొదలు

ఇంకొన్ని రోజులు రెస్ట్ కావాలంటున్నారు ప్రభాస్. మరో నెల తర్వాతే సినిమా షూటింగ్స్ తో బిజీ కాబోతున్నారు. రాధేశ్యామ్ రిలీజ్ తర్వాత యూరప్ లో సర్జరీ చేయించుకున్న ప్రభాస్.. అప్పటి నుంచి రెస్ట్ మోడ్ లోనే గడుపుతున్నారు. ఇప్పుడు తాను తీసుకున్న బ్రేక్ ను ఎక్స్ టెండ్ చేయాలని డిసైడ్ అయ్యారు. నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె, ప్రశాంత్ నీల్ సలార్ ప్రాజెక్ట్స్ కోసం డార్లింగ్ మేజర్ యాక్షన్ స్టంట్స్ చేయాల్సి ఉంది. కానీ ఇప్పుడు కుదరదని.. పోస్ట్ పోన్ చేసి కొత్త షెడ్యూల్స్ ఫిక్స్ చేయమని మేకర్స్ కి ప్రభాస్ చెప్పినట్టు తెలుస్తోంది.

Prabhas : ప్రభాస్‌కి హాలీవుడ్ ఆఫర్?? ఆసియా సూపర్ హీరోగా సినిమా??

బాహుబలి 2 షూటింగ్ టైమ్ లోనే ప్రభాస్ మోకాలికి గాయమైనట్టు చెప్తున్నారు. ఆ నొప్పితోనే సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ తో పాటూ సలార్, ప్రాజెక్ట్ కే సినిమాల్లో కొంత పార్ట్ పూర్తి చేశారు. అయితే మోకాలి నొప్పి పెరగడంతో యూరప్ లో సర్జరీ చేయించుకున్నారనే ప్రచారం జరిగింది. పెరిగిన బరువు కూడా ప్రభాస్ ను చాలా ఇబ్బంది పెడుతోంది. ఎక్కడికెళ్లినా అక్కడ అందరూ ప్రభాస్ బాడీనే పాయింట్ అవుట్ చేస్తున్నారు. అందుకే గుట్టుచప్పుడు కాకుండా ప్రభాస్ లైపో సర్జరీ చేయించుకున్నారనే గాసిప్స్ కూడా వినిపిస్తున్నాయి.

Prabhas: రాధేశ్యామ్ ఎఫెక్ట్.. మళ్లీ ఆ డైరెక్టర్‌కే ప్రభాస్ ఓటు..?

మోకాలి సర్జరీ కావొచ్చు.. లైపో సర్జరీ అయిండొచ్చు.. ప్రభాస్ మాత్రం రెజువనేట్ అయి కొత్తగా సెట్స్ లో అడుగుపెట్టాలని మాత్రం ఫిక్సయ్యారు. సర్జరీ తర్వాత ప్రభాస్ స్లిమ్ అండ్ ఫిట్ గా తయారై బయటికి రావాలనుకుంటున్నారు. ఒక్కో సినిమాకు 100 కోట్లు తీసుకుంటున్న ప్రభాస్.. దానికి తగ్గట్టే ఫిట్ అండ్ హెల్తీగా లైఫ్ లీడ్ చేయాలి. అందుకే ఇప్పుడు రెస్ట్ అవసరం. ఆ తర్వాతే సలార్, ప్రాజెక్ట్ కే కొత్త షెడ్యూల్స్ ను సెట్ చేసుకొని కొత్త సినిమాలు ప్రకటించే అవకాశం ఉంది.