Adipurush : 10 రోజుల్లో ఆదిపురుష్ కలెక్షన్స్ ఎంతంటే..? బ్రేక్ ఈవెన్ కష్టమే అంటున్నారు..!

ఆదిపురుష్ సినిమా 10 రోజులు అవుతున్నా ఇంకా 500 కోట్ల మార్క్ క్రాస్ చేయలేకపోయింది. దీంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కష్టమే అంటున్నారు.

Adipurush : 10 రోజుల్లో ఆదిపురుష్ కలెక్షన్స్ ఎంతంటే..? బ్రేక్ ఈవెన్ కష్టమే అంటున్నారు..!

Prabhas Om Raut Adipurush Collections in 10 days didnt cross 500 crores

Adipurush Collections : ప్రభాస్ ఆదిపురుష్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ అందుకోవడానికి తెగ కష్టాలు పడుతుంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ భారీ అంచనాలు మధ్య రిలీజ్ అయ్యింది. అయితే రామాయణాన్ని కొత్తగా చూపించే ప్రయత్నం చేసి మేకర్స్ భారీగా విఫలమయ్యారు. దీంతో సినిమాకు ఎంతో వ్యతిరేకత ఎదురైంది. అంచనాలు ఉండడంతో మొదటి మూడురోజులు బుకింగ్స్ ముందుగానే సేల్ అవ్వడంతో ఫస్ట్ వీకెండ్ భారీగానే కలెక్షన్స్ అందుకుంది.

Pawan Kalyan : OG నుంచి అదిరిపోయే అప్డేట్.. అప్పుడే సగం షూటింగ్ అయిపోయిందట..

మొదటి వీకెండ్ కి ఈ చిత్రం 340 పైగా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. ఇక ఆ తరువాత నుంచి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టడానికి తెగ ఇబ్బంది పడుతుంది. ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించేందుకు నిర్మాతలు టికెట్ రేట్స్ కూడా తగ్గించి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏమాత్రం ఫలితం ఉండడం లేదు. తాజాగా ఈ మూవీ 10 రోజులు పూర్తీ చేసుకోగా బాక్స్ ఆఫీస్ వద్ద 450 కోట్ల గ్రాస్ ని అందుకుంది. పాన్ ఇండియా మూవీ అయ్యి ఉండి కూడా ఈ చిత్రం ఇప్పటికి 500 కోట్ల మార్క్ క్రాస్ చేయకపోవడంతో.. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టమే అంటున్నారు ట్రేడ్ పండితులు.

Ram Charan : వామ్మో.. కోటి రూపాయల వాచ్.. వైరల్ అవుతున్న రామ్ చరణ్ వాచ్.. అసలు ధర ఎంతో తెలుసా?

ఈ చిత్రాన్ని టి సిరీస్, రెట్రోఫైల్స్ సంస్థలు దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించాయి. ప్రస్తుతం ఈ మూవీ కలెక్షన్స్ చూస్తే.. 450 కోట్ల గ్రాస్ మాత్రమే అందుకుంది. అంటే నెట్ షేర్ సుమారు ఒక 220 కోట్లు మాత్రమే వచ్చాయి. తాజాగా బాలీవుడ్ ఈ సినిమా టికెట్ రేటుని తగ్గించారు. గతంలో పఠాన్ సినిమా విషయంలో కూడా ఇలానే చేసి కలెక్షన్స్ ని రాబట్టారు. ఇప్పుడు ఆదిపురుష్ కూడా అదే ఫార్ములా అప్లై చేస్తున్నారు. మరి ఇది ఎంత వరకు వర్క్ అవుతుందో చూడాలి.