Pawan Kalyan : OG నుంచి అదిరిపోయే అప్డేట్.. అప్పుడే సగం షూటింగ్ అయిపోయిందట..

ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తవ్వగా తాజాగా చిత్రయూనిట్ మరో అప్డేట్ ఇచ్చింది. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో సెట్ వేసి OG సినిమా మూడో షెడ్యూల్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.

Pawan Kalyan : OG నుంచి అదిరిపోయే అప్డేట్.. అప్పుడే సగం షూటింగ్ అయిపోయిందట..

Pawan Kalyan OG Movie half shoot completed

Updated On : June 26, 2023 / 12:01 PM IST

OG :  ఈ సంవత్సరం చివరికల్లా చేతిలో ఉన్న సినిమాలు పూర్తిచేయాలని పవన్(Pawan kalyan) ఫిక్స్ అయ్యారు. గత కొద్ది కాలంగా సినిమా షూటింగ్స్ లో బిజీ ఉన్నాడు. వినోదయ సీతాం రీమేక్ షూట్ పూర్తిచేసిన పవన్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా అంటూనే ఖాళీ దొరికినప్పుడల్లా OG, ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) సినిమాలకు డేట్స్ ఇస్తూ వస్తున్నాడు.

సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో They Call Him OG అనే సినిమా తెరకెక్కుతుంది. దానయ్య నిర్మాణంలో గ్యాంగ్ స్టర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు సమాచారం. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియారెడ్డి.. పలువురు స్టార్ ఆర్టిస్టులు నటిస్తున్నారని ప్రకటించి ఇప్పటికే సినిమాపై అంచనాలను పెంచారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తవ్వగా తాజాగా చిత్రయూనిట్ మరో అప్డేట్ ఇచ్చింది.

Prithviraj Sukumaran : స్టార్ హీరోకు షూటింగ్‌లో ప్రమాదం.. మూడు నెలలు బెడ్ రెస్ట్.. సలార్ లేట్ అవుతుందా?

కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో సెట్ వేసి OG సినిమా మూడో షెడ్యూల్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా OG సినిమా మూడో షెడ్యూల్ కూడా షూటింగ్ పూర్తయిందని, మొత్తం 50 శాతం షూటింగ్ పూర్తయిందని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఓ పక్క ఇంత ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్నారా అని ఆశ్చర్యపోతూనే మరో పక్క సంతోషం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.