Radhe Shyam – Sanchari : రేపే ‘రాధే శ్యామ్’లోని మూడో పాట టీజర్ రిలీజ్

'అనిరుధ్ రవిచందర్' పాడారు. మిగిలిన సౌతిండియన్ వెర్షన్స్ తమిళ్-కన్నడ-మలయాళంలో సత్యప్రకాశ్ తో పాడించారు.

Radhe Shyam – Sanchari : రేపే ‘రాధే శ్యామ్’లోని మూడో పాట టీజర్ రిలీజ్

Radheshyam Sanchari

Radhe Shyam – Sanchari :దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సినిమాలోని మూడో పాట ఏంటో రేపు తెలియబోతోంది. మూడో పాట టీజర్ ను రేపు మధ్యాహ్నం 1గంటకు రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.  దీనికి సంబంధించి.. ఓ ఇంట్రస్టింగ్ ఫొటోను కూడా పోస్ట్ చేసి.. పాటపై ఓ ఇంప్రెషన్ ఇచ్చేశారు.

తెలుగు సంబంధించి.. ‘ఈ రాతలే దోబూచులే..’, ‘నగుమోము తారలే’ అనే రెండు పాటలను ఇప్పటికే రిలీజ్ చేశారు. ఈ రెండు పాటలు కూడా అన్ని ఆడియో ప్లాట్ ఫామ్ లలో టాప్ లో ట్రెండింగ్ లో ఉన్నాయి. జస్టిన్ ప్రభాకరన్ అందించిన సంగీతం.. కృష్ణకాంత్ అందించిన సాహిత్యం.. సింగర్స్  గాత్రం.. అన్నీ కలిపి పాటలు వేరే లెవెల్ లో ఉన్నాయి. మూడో పాటగా ‘సంచారి’ని రిలీజ్ చేయబోతున్నారు. దీనిని కృష్ణకాంత్ రాశారు. ప్రముఖ సంగీత దర్శకుడు కమ్ సింగర్ ‘అనిరుధ్ రవిచందర్’ పాడారు. మిగిలిన సౌతిండియన్ వెర్షన్స్ తమిళ్-కన్నడ-మలయాళంలో సత్యప్రకాశ్ తో పాడించారు.

Read Also : Radhe Shyam: పూజ పాత్రకి విషాదాంతం.. అప్డేట్స్ ఏం చెప్తున్నాయ్?

రాధే శ్యామ్ లోని సంచారి పాట టీజర్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ రిలీజ్ చేసిన పోస్టర్…. టాక్ ఆఫ్ ది ఆల్ ఫిలిం ఇండస్ట్రీస్ గా మారిపోయింది. మంచుకొండల్లో ప్రభాస్ స్కీయింగ్ చేస్తున్న ఫొటోను రిలీజ్ చేశారు. దీంతోపాటు.. చుట్టూ కాయిన్స్, పాత బడిన మ్యాప్, ఓ లెన్స్, బైనాక్యులర్స్.. ఇలా.. క్యూరియాసిటీ రేకెత్తించింది ఈ పోస్టర్.

సంచారి పదం ఇస్తున్న అర్థం ప్రకారం .. ప్రభాస్ ప్రపంచ దేశాలను చుట్టేస్తాడని అర్థం చేసుకోవచ్చు. తాను అందరిలాంటి మనిషినీ కాను.. అలాగని దేవున్నీ కాను.. అంటూ విక్రమాదిత్య క్యారెక్టర్ లోనే ప్రభాస్ గురించిన సమాచారం ఇచ్చేశారు. దీంతో.. మూవీ ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ అందరిలో ఉంది. జనవరి 14న రాధే శ్యామ్ థియేటర్లలో రిలీజ్ కానుంది. మూవీలో పూజాహెగ్డే కథానాయిక. దర్శకుడు రాధాకృష్ణ కుమార్.

Read Also : Radhe Shyam: విజువల్ ట్రీట్.. దుమ్మురేపుతున్న సోచ్ లియా సాంగ్!