Radhe Shyam: విజువల్ ట్రీట్.. దుమ్మురేపుతున్న సోచ్ లియా సాంగ్!

ఎటు చూసినా ఇప్పుడు ప్రేక్షకులకు సినిమా అప్డేట్స్ తోనే పండగలా మారింది. రాబోయే కొత్త సినిమాలకు సంబంధించిన ఒక్కో అప్డేట్ ఒకదాన్ని మించి మరొకటి అనేలా హల్చల్ చేస్తున్నాయి.

Radhe Shyam: విజువల్ ట్రీట్.. దుమ్మురేపుతున్న సోచ్ లియా సాంగ్!

Radhe Shyam

Radhe Shyam: ఎటు చూసినా ఇప్పుడు ప్రేక్షకులకు సినిమా అప్డేట్స్ తోనే పండగలా మారింది. రాబోయే కొత్త సినిమాలకు సంబంధించిన ఒక్కో అప్డేట్ ఒకదాన్ని మించి మరొకటి అనేలా హల్చల్ చేస్తున్నాయి. ఇప్పుడు భారీ అంచనాలున్న నాలుగైదు సినిమాలలో రాధేశ్యామ్ కూడా ఒకటి. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌లలో జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ తెర‌కెక్కిస్తున్న సినిమా రాధే శ్యామ్. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Shah Rukh Khan: మళ్ళీ ట్రాక్‌లోకి షారుఖ్.. ఆగిన సినిమాలు రీస్టార్ట్!

మరో నెలలో రాధేశ్యామ్ సినిమా విడుదల అవుతున్నా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుకావట్లేదని అభిమానులు అందోళన చెందుతున్న తరుణంలో వరుసగా పాటలను విడుదల చేస్తూ అభిమానులను ఖుషీ చేసే పనిలో పడ్డారు నిర్మాతలు. కొద్ది రోజుల క్రితం ఈ రాతలే అంటూ సాగిన ఈ పాట అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. నగుమోము తారలే అంటూ సాగే రెండో సాంగ్ కూడా మంచి విజువల్స్ తో అంద‌రిని అల‌రించింది. ఇక ఈరోజు(బుధవారం) హిందీ వెర్షన్ కు సంబంధించి సోచ్ లియా అనే పాట‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది.

Bigg Boss 5: నా నెత్తి మీద ఎక్కకు సిరి వెళ్ళిపో.. షణ్ముఖ్ ఫైర్ విత్ ఫైర్!

మిథున్ సంగీతం అందిస్తున్న ఈ పాటను బాలీవుడ్ ఫేమస్ సింగర్ అయిన అరిజిత్ సింగ్ పాడగా ఇందులో విజువ‌ల్స్ స్పెషల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. బాలీవుడ్ రొమాంటిక్ సినిమాలకు మరో మెట్టు పైనే ఉండేలా తెరకెక్కిన ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న ఈ పాటను చూసిన ప్రభాస్ అభిమానులు ఇది కదా ప్రభాస్ నుండి మేము కోరుకున్నది అనేస్తున్నారు.

RRR: రోజుకో వీడియో.. పూటకో పోస్టర్.. ప్రమోషన్స్ పీక్స్!