RRR: రోజుకో వీడియో.. పూటకో పోస్టర్.. ప్రమోషన్స్ పీక్స్!

ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ పీక్స్ కి వెళ్తున్నాయి. ఇండియా మొత్తం వెయిట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీపై రోజుకో అప్ డేట్ ఇస్తూ.. ఆడియన్స్ ని ఇంకా ఊరిస్తున్నారు రాజమౌళి.

RRR: రోజుకో వీడియో.. పూటకో పోస్టర్.. ప్రమోషన్స్ పీక్స్!

Rrr

RRR: ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ పీక్స్ కి వెళ్తున్నాయి. ఇండియా మొత్తం వెయిట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీపై రోజుకో అప్ డేట్ ఇస్తూ.. ఆడియన్స్ ని ఇంకా ఊరిస్తున్నారు రాజమౌళి. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ హంగామా స్టార్ట్ చేసిన రాజమౌళి ట్రైలర్ రిలీజ్ ని కూడా పాన్ ఇండియా లెవల్లోనే ప్లాన్ చేశారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ పవర్ ఫుల్ రోల్స్ లో రాజమౌళి తెరకెక్కించిన సినిమా ట్రిపుల్ ఆర్ మూవీ రిలీజ్ కు ఇంకా నెల రోజులే ఉంది. కౌంట్ డౌన్ స్టార్ట్ చేసిన ట్రిపుల్ ఆర్ టీమ్.. అప్ డేట్స్ తో హోరెత్తించేస్తోంది.

Raviteja: జెట్ స్పీడ్‌తో మాస్ రాజా.. నెలకో సినిమా రిలీజ్!

డిసెంబర్ 9న రిలీజ్ అవ్వబోతున్న ట్రైలర్ కోసం తెగ హడావిడి చేస్తోంది. భారీ స్టార్ కాస్ట్ తో భారీ బడ్జెట్ తో భారీ స్కేల్ లో రిలీజ్ అవుతున్న ట్రిపుల్ ఆర్ మూవీ ట్రైలర్ రిలీజ్ ని గ్రాండ్ గా ప్లాన్ చేసింది టీమ్. డిసెంబర్ 9న రిలీజ్ అవుతున్న ట్రైలర్ కోసం రాజమౌళి గట్టిగానే ప్లాన్ చేశారు. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతున్న ట్రైలర్ కి సంబందించి హిందీ ట్రైలర్ ని ముంబైలో పివిఆర్ మాల్ లో గ్రాండ్ లాంచ్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి రాజమౌళి తో పాటు బాలీవుడ్ స్టార్ కాస్ట్ అటెండ్ కాబోతున్నట్టు న్యూస్. సౌత్ లో ఎలాగూ వర్కవుట్ అవుతుంది కాబట్టి.. ఎక్కువ ఫోకస్ బాలీవుడ్ పైనే పెట్టాడు జక్కన్న.

Janhvi Kapoor: డ్రెస్ ఏదైనా దాగనంటున్న జాహ్నవి ఉప్పొంగే అందాలు!

అంతేకాదు.. తర్వాత పాన్ ఇండియా ప్రమోషన్స్ కి కూడా ప్రైవేట్ చార్టర్డ్ ఫ్లైట్ బుక్ చేశారు మేకర్స్. అసలే ఏడాదికి పైగా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న ఈ భారీ మూవీ రిలీజ్ కి ఈ మాత్రం హడావిడి ఉండాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్. రాజమౌళి మార్క్ మూవీ మేకింగ్ తో ఫస్ట్ నుంచి సినిమా మీదఎక్స్ పెక్టేషన్స్ పీక్స్ లోనే ఉన్నాయి. అయితే సినిమాకు సంబందించి మొన్నటి వరకూ పెద్దగా హడావిడి చెయ్యని ట్రిపుల్ ఆర్ టీమ్.. రిలీజ్ దగ్గరపడడంతో ప్రమోషన్ల మోత మోగించేస్తోంది. రోజుకో వీడియో, పూటకో పోస్టర్ రిలీజ్ చేస్తూ.. సోషల్ మీడియాలో సందడితో పాటు అభిమానుల్లో ఆనందాన్ని పెంచేస్తోంది.

Katrina-Vicky: కైఫ్-కౌషల్ వారి పెళ్లిసందడి.. అంతా ఓపెన్ సీక్రెట్!

అంతేకాదు.. జనవరి 7న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ట్రిపుల్ ఆర్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకూ రిలీజ్ అయిన పోస్టర్లు, వీడియోలు, పాటలు ఇలా అన్నీ సినిమా మీద విపరీతమైన ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేశాయి. అంతేకాదు.. అసలు ఎవ్వరూ ఊహించని, ఎక్స్ పెక్ట్ చెయ్యని సినిమా చూడబోతున్నారంటూ రాజమౌళి ముందు నుంచి ఊరించడంతో.. సినిమా రేంజ్ ఇంకా పెరిగిపోయింది. మరి టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ స్టార్ కాస్ట్ తో హై యాక్షన్ ఎలివేషన్స్ తో అంతకుమించిన ఎమోషన్స్ తో తెరకెక్కిన ట్రిపుల్ ఆర్ నెల రోజుల్లో జనవరి 7న ఆడియన్స్ ముందుకురాబోతోంది.