Katrina-Vicky: కైఫ్-కౌషల్ వారి పెళ్లిసందడి.. అంతా ఓపెన్ సీక్రెట్!

సీక్రెట్ సెలబ్రిటీ వెడ్డింగ్ స్టార్ట్ అయ్యింది. బాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్ కత్రినా కైఫ్-విక్కీ కౌషల్ జంట పెళ్లి గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వకపోయినా.. ఓపెన్ సీక్రెట్..

Katrina-Vicky: కైఫ్-కౌషల్ వారి పెళ్లిసందడి.. అంతా ఓపెన్ సీక్రెట్!

Katrina Vicky

Katrina-Vicky: సీక్రెట్ సెలబ్రిటీ వెడ్డింగ్ స్టార్ట్ అయ్యింది. బాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్ కత్రినా కైఫ్-విక్కీ కౌషల్ జంట పెళ్లి గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వకపోయినా.. ఓపెన్ సీక్రెట్ గా ఈ పెళ్లి గురించి అప్ డేట్స్ మాత్రం మీడియాకు తెలుస్తూనే ఉన్నాయి. బాలీవుడ్ రూమర్డ్ కపుల్ కత్రినా-విక్కీ కౌషల్ పెళ్లి చేసుకుంటున్నారని.. రెండు మూడు నెలలనుంచి మీడియా కోడై కూస్తున్నా.. వీళ్లు మాత్రం పెళ్లి వార్తలు నిజమని కానీ, అబద్దమని కానీ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఈ సీక్రెట్ వెడ్డింగ్ కి సంబందించి ప్రతి చిన్న క్లూని మీడియా సంపాదించడంతో వీళ్ల పెళ్లి నిజమేనని క్లారిటీ వచ్చేసింది.

Bhola Shankar: చిరు జెట్ స్పీడ్.. షూట్ అప్డేట్స్ ఇచ్చిన యూనిట్!

ఇప్పటి వరకూ ఎన్ని రూమర్లు నడిచినా.. లేటెస్ట్ గా పెళ్లి కోసం వీళ్లిద్దరూ రాజస్తాన్ వెళ్లే వీడియోతో పెళ్లి మీద ఇంకా ఇంట్రస్ట్ ఎక్కువైంది. కత్రినా-విక్కీ వెడ్డింగ్ పై మొత్తానికి జనానికి క్లారిటీ వచ్చేసింది. వీళ్లిద్దరూ రాజస్తాన్.. మాధోపూర్ సిక్స సెన్సెస్ రిసార్ట్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకుని దానికోసం ప్యాలెస్ తో పాటు కాస్ట్లీ హోటల్స్ కూడా బుక్ చేశారు. 150 నుంచి 200 మంది క్లోజ్డ్ సర్కిల్ మధ్య ఈ స్టార్ కపుల్ పెళ్లి చేసుకోబోతున్నారు. డిసెంబర్ 7,8,9 తేదీల్లో జరగబోతున్న వీళ్ల పెళ్లికి సంబందించి మెహందీ, సంగీత్, హల్దీ, ఇలా ఫుల్ ధూమ్ ధామ్ గా సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసింది ఈ జంట.

RRR Trailer: మా థియేటర్‌కి బందోబస్త్ కావాలి.. పోలీసులకు రిక్వెస్ట్ లెటర్!

సంగీత్ మొత్తం రెట్రో సాంగ్స్ తో పాటు రాజస్తానీ ఫోక్ పర్ ఫామెన్స్ కి లేటెస్ట్ హిట్ సాంగ్స్ యాడ్ చేసి ప్లాన్ చేశారు. ఈ సెలబ్రిటీ వెడ్డింగ్ కోసం టైట్ సెక్యూరిటీ ఎరేంజ్ చేశారు పోలీసులు. అంతేకాదు.. సల్మాన్ ఖాన్ పర్సనల్ బాడీగార్డ్ షేరా తన టైగర్ సెక్యూరిటీ ఏజెన్సీతో దగ్గరుండి ఏర్పాట్లు చూసుకుంటున్నారు. వీళ్ల పెళ్లికి సంబందించి ఫుటేజ్ ని ఓ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ బారీ రేట్ కి కొనేసుకుందని కూడా టాక్. అందుకే వీళ్ల మ్యారేజ్ కి సంబందించి ఎటువంటి ఫోటోలు బయటకురానివ్వడం లేదు. ఈపెళ్లికి హృతిక్ రోషన్, షారూఖ్ ఖాన్, అనుష్క శర్మతో పాటు టాప్ బాలీవుడ్ స్టార్స్ సందడి చెయ్యబోతున్నారు.

TV Actress Lahari: బైక్‌ను ఢీకొట్టిన సీరియల్ నటిలహరి