Bhola Shankar: చిరు జెట్ స్పీడ్.. షూట్ అప్డేట్స్ ఇచ్చిన యూనిట్!

అప్పుడెప్పుడో చిరంజీవి మెగాస్టార్ అయిన కొత్తలో ఏడాదికి నాలుగు సినిమాలు చేసేవాడు. కానీ.. ఇప్పుడు హీరోలంతా ఏడాదికి ఒక సినిమా తెరకెక్కించడం అంటే మహా గొప్పగా మారింది.

Bhola Shankar: చిరు జెట్ స్పీడ్.. షూట్ అప్డేట్స్ ఇచ్చిన యూనిట్!

Bhola Shankar

Bhola Shankar: అప్పుడెప్పుడో చిరంజీవి మెగాస్టార్ అయిన కొత్తలో ఏడాదికి నాలుగు సినిమాలు చేసేవాడు. కానీ.. ఇప్పుడు హీరోలంతా ఏడాదికి ఒక సినిమా తెరకెక్కించడం అంటే మహా గొప్పగా మారింది. కానీ.. మెగాస్టార్ మాత్రం ఎన్నడూ లేనివిధంగా ఒకటికి నాలుగు సినిమాలను సెట్స్ మీదకి తీసుకెళ్లాడు. సెట్స్ మీదకి వెళ్లడమే కాదు.. స్టార్ట్ చేసిన ప్రతి సినిమాని జెడ్ స్పీడ్ తో కంప్లీట్ చేసేందుకు సిద్ధపడుతున్నాడు. దాని కోసం వరసపెట్టి షూటింగ్ షెడ్యూల్స్ సిద్ధం చేసుకుంటున్నాడు.

Shannu Deepu : షన్ను-దీపు పెళ్ళికి మాకు ఓకే.. కానీ ఒక్క కండిషన్ : షణ్ముఖ్ పేరెంట్స్

చిరంజీవి ప్రస్తుతం ఆచార్య పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు గాడ్ ఫాదర్, భోళాశంకర్, వాల్తేరు వీరయ్య(వర్కింగ్ టైటిల్) సినిమాలను షూటింగ్ మొదలు పెట్టాడు. మూడు సినిమాలను పార్లర్ గా పూర్తి చేసేందుకు సిద్దమైన చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ షూటింగ్ లో ఉన్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ కాగా.. కీర్తి సురేష్ చెల్లెలు పాత్రలో నటిస్తుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు ఒక మాసివ్ సాంగ్ ని కంప్లీట్ చేసినట్టుగా యూనిట్ ప్రకటించింది.

Bigg Boss : మోసం చేసిన బాయ్‌ఫ్రెండ్.. పోలీసులను ఆశ్రయించిన బిగ్‌బాస్ బ్యూటీ

ఆన్ లొకేషన్ ఫొటోస్ విడుదల చేసి యూనిట్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. ఈ సాంగ్ ని ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ సారథ్యంలో భారీ సెట్టింగ్స్ లో షూట్ చేశారు. ఇక చిత్ర యూనిట్ ఆల్రెడీ రెండో షెడ్యూల్ కూడా స్టార్ట్ చేసేసినట్టు తెలిపగా వచ్చే ఏడాది సమ్మర్ కి షూటింగ్ పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఈ మూడు సినిమాలు పూర్తి కాకుండానే వెంకీ కుడుములతో మరో సినిమాకి కూడా ఒకే చెప్పిన చిరు ఇందులో ఏ సినిమా పూర్తయినా వెంటనే ఆ సినిమాని కూడా సెట్స్ మీదకి తీసుకెళ్లనున్నారు.