Talliki Vandanam: తల్లికి వందనం.. మీకు డబ్బులు పడతాయో లేదో ఇలా తెలుసుకోండి.. సింపుల్ ప్రాసెస్
ఒకటవ తరగతి నుంచి ఇంటర్ చదివే విద్యార్థుల వరకు ఈ పథకం వర్తిస్తుంది. ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా పథకం వర్తించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
Talliki Vandanam: ఏపీలోని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక పథకాల్లో తల్లికి వందనం ఒకటి. ఈ పథకం ప్రతి ఏటా రూ.15 వేలు నేరుగా ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇందులో రూ.13 వేలు విద్యార్థి తల్లి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. మిగిలిన రూ.2 వేలు సూళ్ల నిర్వహణ కోసం వినియోగిస్తారు. ఒకటవ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఈ సాయం అందజేస్తుంది.
మరి తల్లికి వందనం స్కీమ్ వర్తిస్తుందో లేదో, అర్హులో కాదో తెలుసుకోవడం ఎలా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. దానికి ఒక సింపుల్ ప్రాసెస్ ఉంది. bm-sgsw.ap.gov.in/ సైట్లోకి వెళ్లాలి. అందులో స్కీమ్ ఎలిజిబిలిటీపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. స్కీమ్ టైప్‌లో తల్లికి వందనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ ఇయర్ లో ఇయర్ ఎంటర్ చేసి గెట్ డీటైల్స్‌పై క్లిక్ చేయాలి. వెంటనే ఆధార్ లింకైన ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే లబ్ధిదారు సమాచారం కనిపిస్తుంది. అందులో ఏమైనా తప్పులుంటే సచివాలయాల్లో సంప్రదించాలి.
ఇక, 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం పథకానికి రాష్ట్ర బడ్జెట్లో రూ.9,668 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. గతేడాది విద్యా సంవత్సరం ప్రారంభమైన జూన్ 12నే అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేసింది సర్కార్. ఈ ఏడాది కూడా అదే తేదీన నిధులు విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఒకటవ తరగతి నుంచి ఇంటర్ చదివే విద్యార్థుల వరకు ఈ పథకం వర్తిస్తుంది. ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా పథకం వర్తించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు చొప్పున ఇస్తుండగా.. ఇందులో తల్లుల ఖాతాలో రూ.13 వేలు జమ చేస్తున్నారు. మిగతా రూ.2 వేలు పాఠశాల నిర్వహణ నిమిత్తం వాడుతున్నారు. తల్లికి వందనం స్కీమ్ లబ్ధి పొందాలంటే తల్లుల బ్యాంకు ఖాతా, మొబైల్ కి ఆధార్ అనుసంధానం తప్పనిసరి. కుటుంబ సభ్యుల మ్యాపింగ్ కూడా కీలకమే. అర్హులైన వారు బ్యాంకుకి వెళ్లి ఖాతా స్టేటస్ ను చెక్ చేసుకోవాలి. ఆధార్, బ్యాంకు ఖాతా, మొబైల్ నెంబర్ ఒకదానితో ఒకటి లింకై ఉండాలి.
Also Read: మీ జాబ్ మానేశారా? EPFO పోర్టల్‌లో మీ ఎగ్జిట్ తేదీని అర్జెంట్‌గా అప్డేట్ చేయండి!
