Shah Rukh Khan: మళ్ళీ ట్రాక్‌లోకి షారుఖ్.. ఆగిన సినిమాలు రీస్టార్ట్!

బాలీవుడ్ బాద్ షా ఇప్పుడిప్పుడే లైన్లోకొస్తున్నారు. మొన్నటి వరకూ ఆర్యన్ ఖాన్ ఇష్యూస్ తో టెన్షన్ పడ్డ షారూఖ్.. ఇప్పుడే కాస్త కుదుట పడ్డారు. అందుకే ఆగిపోయిన షూటింగ్స్..

Shah Rukh Khan: మళ్ళీ ట్రాక్‌లోకి షారుఖ్.. ఆగిన సినిమాలు రీస్టార్ట్!

Shahrukh Khan

Shah Rukh Khan: బాలీవుడ్ బాద్ షా ఇప్పుడిప్పుడే లైన్లోకొస్తున్నారు. మొన్నటి వరకూ ఆర్యన్ ఖాన్ ఇష్యూస్ తో టెన్షన్ పడ్డ షారూఖ్.. ఇప్పుడే కాస్త కుదుట పడ్డారు. అందుకే ఆగిపోయిన షూటింగ్స్ ని, పోస్ట్ పోన్ అయిన షెడ్యూల్స్ ని ఫిక్స్ చేసేపనిలో పడ్డారు. బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్.. షూటింగ్ స్టార్ట్ చేద్దామనుకుంటున్నారు. మొన్నటివరకూ కోర్టులు, కేసులు అంటూ కొడుకు ఆర్యన్ పెట్టిన టెన్షన్ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు.

Bigg Boss 5: నా నెత్తి మీద ఎక్కకు సిరి వెళ్ళిపో.. షణ్ముఖ్ ఫైర్ విత్ ఫైర్!

సిచ్యువేషన్స్ కంట్రోల్ వచ్చాక షూటింగ్ స్టార్ట్ చేద్దామని ముందే చెప్పిన షారూఖ్.. ఆగిపోయిన సినిమాల్ని స్టార్ట్ చెయ్యమని టీమ్ తో చెప్పారు. మొన్నటి వరకూ పఠాన్ తో పాటు అట్లీతో ప్లాన్ చేస్తున్న రెండు సినిమాల్ని పక్కన పెట్టేసిన షారూఖ్ మళ్లీ షెడ్యూల్స్ ఫిక్స్ చేసుకుంటున్నారు. నిజానికి పఠాన్ యూనిట్ అక్టోబర్ 10న స్పెయిన్ షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు. అయితే ఆర్యన్ అరెస్ట్ తో ప్లాన్ మొత్తం మారిపోయి షూటింగ్ ఆగిపోయింది. దీపికా పదుకోన్ హీరోయిన్ గా, జాన్ అబ్రహం విలన్ గా భారీ యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న పఠాన్ మూవీ డిసెంబర్15 నుంచి షూటింగ్ మొదలుపెట్టుకుంటోంది.

RRR: రోజుకో వీడియో.. పూటకో పోస్టర్.. ప్రమోషన్స్ పీక్స్!

ముంబైలోని షూటింగ్ సెట్ లో 15 నుంచి 20 రోజులు ఈ యాక్షన్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నాక.. మరో షెడ్యూల్ కోసం ఫారెన్ వెళుతున్నారు పఠాన్ అండ్ టీమ్. ఈయాక్షన్ థ్రిల్లర్ పఠాన్ కోసం కంప్లీట్ గా ఫిజిక్ ని మెయింటెన్ చేస్తున్న షారూఖ్.. దాదాపు నెలకు పైగా బ్రేక్ రావడంతో మళ్లీ ఫిట్ నెస్ మీద దృష్టిపెట్టారు. ఈ సినిమాతో పాటు సౌత్ డైరెక్టర్ అట్లీతో చేస్తున్న కమర్షియల్ ఎంటర్ టైనర్ కోసం దాదాపు 150 నుంచి 160 రోజులు ముంబై, దుబాయ్ లో ఎక్స్ టెన్సివ్ షూట్ కి ప్లాన్ చేసుకున్నారు షారూఖ్ ఖాన్. ఇలా గ్యాప్ తర్వాత ఇప్పటి వరకూ వేస్ట్ అయిన టైమ్ ని టైట్ గా షూటింగ్ కి ప్లాన్ చేసుకున్నారు షారూఖ్.