Prabhas Family : ఫ్యామిలీ పెద్దదే డార్లింగ్..!

రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యామిలీ త్రో బ్యాక్ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది..

Prabhas Family : ఫ్యామిలీ పెద్దదే డార్లింగ్..!

Prabhas Family

Updated On : September 27, 2021 / 8:29 PM IST

Prabhas Family: రెబల్ స్టార్ ప్రభాస్‌కి సంబంధించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా సరే వైరల్ చేసేస్తుంటారు ఫ్యాన్స్. ‘బాహుబలి’ తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని వరుసగా పాన్ ఇండియాతో పాటు పాన్ వరల్డ్ సినిమాలు కూడా లైన్లో పెడుతూ ఫుల్ బిజీగా ఉన్నాడు డార్లింగ్.

Prabhas : ప్రభాస్ బిర్యానీకి బాలీవుడ్ భామ ఫిదా..

ఓం రౌత్ దర్శకత్వంలో హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరెక్కుతున్న బాలీవుడ్ ఎంట్రీ మూవీ ‘ఆదిపురుష్’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. సోమవారం ఈ సినిమా రిలీజ్ డేట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. 2022 ఆగస్టు 11న 3డిలో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో భారీగా రిలీజ్ చెయ్యనున్నారు.

ఇక డార్లింగ్‌కి సంబంధించిన క్రేజీ పిక్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. ప్రభాస్ ఫ్యామిలీతో కలిసి ఉన్న త్రో బ్యాక్ పిక్ అది. పెదనాన్న కృష్ణంరాజుతో పాటు అన్నలు, చెల్లెల్లు, ఇతర బంధువులంతా ఉన్నారు ఆ ఫొటోలో. ‘మెమరబుల్ మూమెంట్.. ఫ్యామిలీ పెద్దదే డార్లింగ్’ అంటూ ఫ్యాన్స్, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Posani : పవన్ కళ్యాణ్‌పై పోసాని ఫైర్..

ప్రభాస్ – పూజా హెగ్డే జంటగా నటించిన ‘రాధే శ్యామ్’ సంక్రాంతి కానుకగా 2022 జనవరి 14న రిలీజ్ కానుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న ‘సలార్’ నాగ్ అశ్విన్‌తో చేస్తున్న పాన్ వరల్డ్ మూవీ ‘ప్రాజెక్ట్ – K’ (వర్కింగ్ టైటిల్) షూటింగ్ ఇటీవలే స్టార్ట్ అయింది.

Radhe Shyam : సంక్రాంతికి ‘రాధే శ్యామ్’.. ‘వర్షం’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా..?