Posani : పవన్ కళ్యాణ్‌పై పోసాని ఫైర్.. | Posani

Posani : పవన్ కళ్యాణ్‌పై పోసాని ఫైర్..

పవన్ కళ్యాణ్.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యల గురించి పోసాని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు..

Posani : పవన్ కళ్యాణ్‌పై పోసాని ఫైర్..

Posani: మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ రంగాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే మహేష్ బాబు, కార్తికేయ వంటి పలువురు సినీ పరిశ్రమ వారు సోషల్ మీడియా ద్వారా పవన్‌కు మద్దతు తెలిపారు.

Pawan Kalyan : సినీ ప‌రిశ్ర‌మ‌కు ఇబ్బందులు క‌లిగిస్తే తాట తీస్తా – పవన్ కళ్యాణ్ ఘాటు హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్‌లోని అధికార ప్రభుత్వం, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గురించి పవన్ మాట్లాడిన విధానాన్ని తప్పు బడుతూ అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నాని ఆయనపై విమర్శలు గుప్పించారు. ఇక రీసెంట్‌గా సినీ నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కూడా పవన్ మీద ఫైర్ అయ్యారు..

‘‘పవన్ తనను తానే ప్రశ్నించుకుంటారు.. తానే సమాధానమిచ్చుకుంటారు. అంటూ కామెంట్స్ చేశారు. పేర్ని నాని అన్నేసి మాటలంటుంటే సిగ్గు అనిపించలేదా.. నీ రెమ్యునరేషన్ చెప్పుకోడానికి కూడా అబద్ధం చెప్పావ్.. పది కోట్లు అనుకోండి అన్నావ్.. నువ్వు 50 కోట్లు తీసుకుంటున్నావ్.. తప్పైతే చెప్పుతో కొట్టు.. జగన్ టికెట్ల విషయంలో మీకు ఫేవర్ చేస్తే మంచోడు లేకపోతే కాదా.. పవన్.. నీ రెమ్యునరేషన్ ఎంత 10కోట్లా.. లేక 50కోట్లా? నీ రెమ్యునరేషన్ పది కోట్లు అయితే నేను నాలుగు సినిమాలు చేస్తాను నీతో..

పవన్ మీ సినిమాలకు టిక్కెట్ రెట్లు 500, 1000లు ఏంటి.. మధ్య తరగతి మరియు సామాన్యులను హింసించడమే కదా? హీరోలంటే ఎవరో తెలుసా… ఎన్టీ రామారావు గారు.. అక్కినేని నాగేశ్వరరావు గారు.. వాళ్లతో పోలిస్తే మన టాలెంట్ పది శాతమే.. వాళ్ల సినిమాలకు ఓపెనింగ్స్ అదిరిపోయేవి. ఎంత ఎక్కువ కలెక్షన్లు వచ్చినా ఎప్పుడూ రెమ్యునరేషన్ పెంచలేదు. ఎప్పుడూ డిస్ట్రిబ్యూటర్ల విషయంలో వేలు పెట్టలేదు.. వాళ్లు తెరమీద తెరవెనుక కూడా హీరోలే.. ముద్రగడ పద్మనాభంని చంద్రబాబు హయాంలో ఎన్నో విధంగా చిత్ర హింసలు పెట్టారు ప్రశ్నించావా పవన్ కళ్యాణ్..

నీకు ప్రేమ ఉన్నప్పుడు చంద్ర బాబుని ఇంద్రుడు అంటావు లేకపోతే తిడతావు.. పవన్ నువ్వు ఏ పార్టీతో సరిగ్గా వున్నావు.. ఏ పార్టీని మిగిల్చావు.. పవన్ కళ్యాణ్ ప్రజల మనిషి కాదు.. నువు రాజకీయంగా ఎన్నో తప్పులు చేస్తున్నావు.. నేను ఒన్ టాలెంట్‌తో పైకి వచ్చాను.. చిరంజీవి గారు సంస్కారవంతుడు.. చిరంజీవి ఇంట్లో ఆడపడిచుల్ని గురించి అసాసినెట్ చేస్తే నువ్వు ఎక్కడ ప్రశ్నించావు.. నేను ప్రశ్నించాను.. అందుకే అప్పుడు వాళ్ళు నన్ను చంపుతాను అన్నారు..

పవన్ కళ్యాణ్.. నీకు ఎప్పుడు ఎక్కడ ప్రశ్నించాలో తెలీదు.. జగన్ గారు మంచి పనులు చేస్తున్నారు అందుకే నాకు జగన్ అంటే ప్రేమ.. పవన్ కళ్యాణ్ నీకు ఏ క్వాలిటీస్ ఉన్నాయని జగన్‌ని తిడుతున్నావు.. నువ్వు కులాలను రెచ్చగొడుతున్నావు.. నువ్వు దిల్ రాజుని అన్నావ్.. ఆయన దగ్గర వేరే కులాల వాళ్ళు కూడా ఎంతో మంది పని చేస్తున్నారు.. 35ఏళ్ల నుంచి చిరంజీవిని చూస్తున్నాను.. చిరంజీవి ఒక్కసారి అయినా ఎవరినీ ఒరేయ్ అన్నాడా? నేర్చుకో పవన్.. అకారణంగా జగన్‌ని తిడుతూ ఉంటాడు పవన్’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోసాని కామెంట్స్ గురించి పవన్ స్పందిస్తారో లేదో చూడాలి..

×