Project K : ప్రభాస్ ప్రాజెక్ట్ K పోస్ట్‌పోన్.. రీజన్ అదేనట!

ప్రభాస్ ప్రాజెక్ట్ K ని వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేస్తామంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ డేట్ మారనుంది అంటూ..

Project K : ప్రభాస్ ప్రాజెక్ట్ K పోస్ట్‌పోన్.. రీజన్ అదేనట!

Prabhas Project K is postponed due to Amitabh Bachchan health

Project K : ప్రభాస్ నటించిన ఆదిపురుష్ (Adipurush) ట్రైలర్ నిన్న రిలీజ్ అయ్యి పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేయడంతో రెబల్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. టీజర్ కంటే ట్రైలర్ లో గ్రాఫిక్స్ అదిరిపోవడంతో సినిమా రిలీజ్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. జూన్ 16న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇదే ఏడాది సలార్ (Salaar) సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. ఇక ప్రాజెక్ట్ K ని వచ్చే ఏడాది సంక్రాంతికి తీసుకు వస్తామంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. మూడు నెలలు గ్యాప్ లోనే ఈ చిత్రాలన్నీ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి.

Adipurush : మరో వివాదంలో ఆదిపురుష్.. చిత్రయూనిట్ పై ఫైర్ అవుతున్న యూట్యూబర్స్..

దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్ల వద్ద సందడి చేసేందుకు ప్లాన్స్ వేసుకుంటున్నారు. అయితే అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్. ప్రాజెక్ట్ K వెనక్కి వెళ్లబోతుంది అని తెలుస్తుంది. ప్రాజెక్ట్ K లో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల అమితాబ్ పై యాక్షన్ సన్నివేశం తెరకెక్కిస్తున్న సమయంలో ఆయనకి గాయం అవ్వడంతో మూవీ షూటింగ్ కి బ్రేక్ పడింది. కంప్లీట్ రెస్ట్ లో ఉన్న అమితాబ్ కోలుకోవడానికి మరికొంత సమయం పట్టనుంది అని సమాచారం.

Adipurush: ‘ఆదిపురుష్’ ట్రైలర్ లాంచ్‌లో సందడి చేసిన చిత్ర యూనిట్

అమితాబ్ మళ్ళీ ఎప్పుడు షూటింగ్ లో పాల్గొంటాడు అనే దాని పై కూడా సరైన సమాచారం లేదు. ఇక షూటింగ్ లేటు అవుతుండడంతో రిలీజ్ కూడా వాయిదా పడే అవకాశం ఉందంటూ ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో ఎక్కువ శాతం గ్రాఫిక్స్ వర్క్ ఉంది. షూటింగ్ శరవేగంగా పూర్తి చేసినప్పటికీ VFX విషయంలో లేటు అయ్యే అవకాశం ఉందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ప్రాజెక్ట్ K నిజంగా వెనక్కి వెళ్తుందా? లేదా చెప్పిన టైంకే వచ్చేస్తుందా? చూడాలి. కాగా ఈ సినిమాలో దీపికా పడుకోణె (Deepika Padukone), దిశా పటాని (Disha Patani) నటిస్తున్నారు.