Adipurush : మరో వివాదంలో ఆదిపురుష్.. చిత్రయూనిట్ పై ఫైర్ అవుతున్న యూట్యూబర్స్..

పలు వివాదాల్లో ఆదిపురుష్ నిలిచింది. ఇటీవలే ట్రైలర్ ని రిలీజ్ చేయగా అద్భుతంగా ఉంది అనిపించకపోయినా టీజర్ తో పోలిస్తే పర్వాలేదనిపించింది. అయితే ఈ ట్రైలర్ తో ఆదిపురుష్ మరోసారి వివాదంలో నిలిచింది.

Adipurush : మరో వివాదంలో ఆదిపురుష్.. చిత్రయూనిట్ పై ఫైర్ అవుతున్న యూట్యూబర్స్..

Adipurush movie in another issue youtubers trolled movie unit

Adipurush : ప్రభాస్(Prabhas) హీరోగా రామాయణం(Ramayanam) ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్(Adipurush). కృతిసనన్(Krithisanon) సీతగా, సైఫ్ అలీఖాన్(Saif Alikhan) రావణాసురుడిగా నటిస్తున్నారు. 500 కోట్ల భారీ బడ్జెట్ తో బాలీవుడ్(Bollywood) దర్శకుడు ఓం రౌత్(Om Raut) ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మొదట సినిమాపై భారీ అంచనాలు ఉన్నా కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేసిన టీజర్ తో విమర్శలు రాగా, టీజర్ పై వ్యతిరేకత రాగా సినిమాపై హైప్ పోయింది.

సినిమాపై విమర్శలు రావడంతో పాటు వివాదాల్లో కూడా నిలిచింది. రామాయణం పాత్రలలోని కట్టు బొట్టు మార్చేశారు. అసలు ఇది రామాయణం ఏంటి అని, హిందూ మనోభావాలు దెబ్బ తీశారని పలువురు ఆదిపురుష్ సినిమాపై పలుచోట్ల కేసులు కూడా నమోదు చేశారు. ప్రతీక్ అనే ఓ కాన్సెప్ట్ ఆర్టిస్ట్ డిజైనర్ ఆదిపురుష్ టీం తన డిజైన్స్ ని, డ్రాయింగ్స్ ని కాపీ కొట్టిందని ఆరోపించాడు. ఇలా పలు వివాదాల్లో ఆదిపురుష్ నిలిచింది. ఇటీవలే ట్రైలర్ ని రిలీజ్ చేయగా అద్భుతంగా ఉంది అనిపించకపోయినా టీజర్ తో పోలిస్తే పర్వాలేదనిపించింది.

అయితే ఈ ట్రైలర్ తో ఆదిపురుష్ మరోసారి వివాదంలో నిలిచింది. సాధారణంగా ఇలా ట్రైలర్స్ రిలీజయినప్పుడు పలువురు యూట్యూబర్స్ ట్రైలర్స్, ట్రైలర్ లో స్క్రీన్ షాట్స్ తీసుకొని రియాక్షన్ వీడియోస్ చేస్తారు. వీటికి సాధారణంగా కాపీ రైట్ పడదు. కనీసం స్క్రీన్ షాట్స్ వదినా కాపీ రైట్ పడదు. కానీ ఆదిపురుష్ ట్రైలర్స్, స్క్రీన్ షాట్స్ వాడటంతో పలువురు యూట్యూబర్స్ కి కాపీ రైట్ పడింది. AiPlex అనే సంస్థ నుంచి కాపీ రైట్స్ పడుతున్నాయని, తమ వీడియోని బ్లాక్ చేసేశారని పలువురు యూట్యూబర్స్ ఆరోపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Adipurush Trailer : ప్రభాస్ ఆదిపురుష్ ట్రైలర్ వచ్చేసింది.. గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయో చూశారా?

ఏ సినిమాకు ఇలా జరగలేదు. మేము ఇవి చేయడం వల్ల సినిమాకు కూడా ప్రమోషన్స్ అవుతాయి. కానీ మా మీద ఇలా ఆదిపురుష్ టీం ఇలా కాపీ రైట్స్ వేయడం కరెక్ట్ కాదు అని ఫైర్ అవుతున్నారు. యూట్యూబ్ మాత్రమే కాక, సోషల్ మీడియాలో కూడా ట్రైలర్, అందులోని షాట్స్ వీడియోల రూపంలో పోస్ట్ చేసిన వారికి కూడా కాపీ రైట్ వేస్తున్నారు. మరి దీనిపై ఆదిపురుష్ టీం ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి. అసలే సినిమాకు నెగిటివిటి ఉన్న సమయంలో ఇలాంటివి చేసి ఇంకా నెగిటివిటి తెచ్చుకోవడం ఎందుకు అని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.