Adipurush Trailer : ప్రభాస్ ఆదిపురుష్ ట్రైలర్ వచ్చేసింది.. గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయో చూశారా?

ప్రభాస్ ఆదిపురుష్ ట్రైలర్ కోసం దేశమంతటా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఆ ట్రైలర్ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది.

Adipurush Trailer : ప్రభాస్ ఆదిపురుష్ ట్రైలర్ వచ్చేసింది.. గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయో చూశారా?

Prabhas Kriti Sanon Adipurush Trailer released

Adipurush Trailer : రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న మైథిలాజికల్ మూవీ ఆదిపురుష్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం రామాయణం కథాంశంతో వస్తుంది. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ (Kriti Sanon) సీతగా, సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) రావణాసురిడిగా నటించిన ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ గ్రాఫిక్స్ విషయంలో ఎన్నో విమర్శలు ఎదురుకున్న చిత్ర యూనిట్ అవన్నీ సరి చేసుకొని ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు.

Vijay devarakonda : బర్త్ డే బాయ్ విజయ్ దేవరకొండ.. ఈ సారైనా హిట్ కొడతాడా?

ఈ క్రమంలోనే నేడు (మే 9) ఈ మూవీ ట్రైలర్ ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ని 2D అండ్ 3D ఫార్మాట్స్ లో రిలీజ్ చేస్తుండగా.. 3D ట్రైలర్ ని ఈరోజు సాయంత్రం 5:04 నిమిషాలకు దేశమంతటా పలు థియేటర్స్ లో ప్రదర్శించనున్నారు. అయితే అంతకంటే ముందే ఈరోజు మధ్యాహ్నం ఈ ట్రైలర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేశారు. ఇక ఈ ట్రైలర్ చూసిన ఆడియన్స్ టీజర్ లోని గ్రాఫిక్స్ కంటే ఇప్పటి VFX వర్క్ బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Vijay Devarakonda : బర్త్‌డే స్పెషల్ ట్రీట్ ఇస్తున్న విజయ్ దేవరకొండ.. అందరికి ఐస్ క్రీం ఫ్రీ..

ఇక ఈ సినిమా జూన్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. బాలీవుడ్ నిర్మాణ సంస్థలు టీసిరీస్, రెట్రోఫైల్స్ ఈ చిత్రాన్ని దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తెలుగులో యూవీ క్రియేషన్స్ ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువటిని విజయాన్ని అందుకుంటుందో చూడాలి.