Vijay Devarakonda : బర్త్‌డే స్పెషల్ ట్రీట్ ఇస్తున్న విజయ్ దేవరకొండ.. అందరికి ఐస్ క్రీం ఫ్రీ..

నేడు విజయ్ పుట్టిన రోజు కావడంతో కొన్ని ఐస్ క్రీం ట్రక్స్ ని రెంట్ కి తీసుకొని విజయ్ దేవరకొండ బర్త్ డే ట్రక్ అనే పేరుతో హైదరాబాద్, వైజాగ్, చెన్నై, బెంగుళూరు, ముంబై, పూణే, ఢిల్లీలో తిప్పుతూ ఫ్రీగా జనాలకు ఐస్ క్రీమ్స్ పంచిపెడుతున్నాడు.

Vijay Devarakonda : బర్త్‌డే స్పెషల్ ట్రీట్ ఇస్తున్న విజయ్ దేవరకొండ.. అందరికి ఐస్ క్రీం ఫ్రీ..

Vijay Devarakonda offers free Ice Cream to every one on his birthday

Updated On : May 9, 2023 / 10:46 AM IST

Vijay Devarakonda :  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి, ఎవడే సుబ్రహ్మణ్యం(Evade Subrahmanyam) సినిమాతో గుర్తింపు తెచ్చుకొని పెళ్లి చూపులు(Pelli Choopulu) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి అర్జున్ రెడ్డి(Arjun Reddy) సినిమాతో స్టార్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ. అక్కడ్నుంచి ఎన్ని హిట్స్, ఫ్లాప్స్ వచ్చినా విజయ్ క్రేజ్ మాత్రం అలాగే పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. యూత్ లో, ముఖ్యంగా అమ్మాయిల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ విజయ్ కి ఎక్కువే. కేవలం సినిమాలతోనే కాకుండా యాడ్స్(Ads), బిజినెస్(Business) లతో కూడా విజయ్ బాగా బిజీ అయి డబ్బులు సంపాదిస్తున్నాడు.

నేడు మే 9న విజయ్ దేవరకొండ పుట్టిన రోజు కావడంతో అభిమానులు, నెటిజన్లు, పలువురు సెలబ్రిటీలు విజయ్ కు సోషల్ మీడియా వేడుకగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే విజయ్ తన పుట్టిన రోజు సందర్భంగా అందరికి స్పెషల్ ట్రీట్ ఇస్తున్నాడు. ఇటీవల విజయ్ దేవరకొండతో కలిసి ప్రముఖ ఐస్ క్రీం కంపెనీ క్రీంస్టోన్ తమ ఉత్పత్తుల్లో విజయ్ దేవరకొండ క్రియేషన్ పేరుతో ఓ ఫ్లేవర్ ఐస్ క్రీంని తయారు చేసింది. దీనిని స్వయంగా విజయ్ దేవరకొండ తయారుచేసి ఆ రోజు కొంతమందికి ఫ్రీగా ఐస్ క్రీం అందించాడు.

గతంలో కూడా విజయ్ దేవరకొండ ఓ సారి క్రీం స్టోన్ తో కలిసి తన పుట్టిన రోజు నాడు కొంతమందికి ఫ్రీగా ఐస్ క్రీంలను అందించాడు. నేడు విజయ్ పుట్టిన రోజు కావడంతో కొన్ని ఐస్ క్రీం ట్రక్స్ ని రెంట్ కి తీసుకొని ‘ది దేవరకొండ బర్త్ డే ట్రక్’ అనే పేరుతో హైదరాబాద్, వైజాగ్, చెన్నై, బెంగుళూరు, ముంబై, పూణే, ఢిల్లీలో తిప్పుతూ ఫ్రీగా జనాలకు ఐస్ క్రీమ్స్ పంచిపెడుతున్నాడు. ఈ మేరకు తన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని తెలుపుతూ.. ‘ది దేవరకొండ బర్త్ డే ట్రక్’ అని కొన్ని ట్రక్స్ మీ సిటీలలో తిరుగుతాయి. అక్కడికి వెళ్లి ఇవాళ ఫ్రీగా ఐస్ క్రీమ్స్ తీసుకోండి. మీరు నాకు చాలా ప్రేమను అందించారు. నా తరపున మీకు ఈ చిన్న గిఫ్ట్. అలాగే ఖుషి సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ కూడా ఇవాళే రిలీజ్ చేస్తున్నాము అని ట్వీట్ చేశాడు.

Sobhita Dhulipala : నేను తప్పు చేయనప్పుడు ఎందుకు క్లారిటీ ఇవ్వాలి.. చైతూతో డేటింగ్ రూమర్స్ పై మొదటి సారి మాట్లాడిన శోభిత..

దీంతో విజయ్ ట్వీట్ వైరల్ అవ్వగా ఇలా ఐస్ క్రీం పార్టీ అందిస్తున్నందుకు పలువురు విజయ్ ని అభినందిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో విజయ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరి మీరు కూడా విజయ్ ఇచ్చే ఐస్ క్రీంను ఫ్రీగా అందుకోండి.