Sobhita Dhulipala : నేను తప్పు చేయనప్పుడు ఎందుకు క్లారిటీ ఇవ్వాలి.. చైతూతో డేటింగ్ రూమర్స్ పై మొదటి సారి మాట్లాడిన శోభిత..
తాజాగా హైదరాబాద్ లో ఓ షాప్ ఓపెనింగ్ కి శోభిత రాగా మీడియాతో మాట్లాడింది. ఓ మీడియా ప్రతినిధి మీపై ఇటీవల వస్తున్న ఓ రూమర్ గురించి ఏమన్నా స్పందిస్తారా అంటూ ఇండైరెక్ట్ గా చైతూ రూమర్స్ గురించి అడిగారు.

Sobhita Dhulipala gives clarity on rumors with Naga Chaitanya
Sobhita Dhulipala : చైతన్య(Chaitanya), సమంత(Samantha) విడిపోయాక ఇద్దరిపై రకరకాల రూమర్స్ వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. అయితే హీరోయిన్ శోభిత ధూళిపాళ(Sobhita Dhulipala) నాగ చైతన్యతో డేటింగ్ చేస్తుందని వార్తలు వచ్చాయి. ఇద్దరూ కలిసి ఒక్క సినిమా కూడా చేయకపోయినా ఫారిన్ లో వీరిద్దరూ కలిసి ఫోటో దిగడం, పార్టీ చేసుకోవడం, ఓ ప్రముఖ చెఫ్ తో ఫోటో దిగడం.. ఇలాంటి వాటితో శోభిత, చైతూ డేటింగ్ లో ఉన్నారని రూమర్స్ బాగా వచ్చాయి. అయితే వీటిపై ఇప్పటివరకు ఇద్దరూ స్పందించలేదు.
తెలుగమ్మాయి అయినా శోభిత ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో బిజీగానే ఉంది. ఇటీవలే పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాలో నటించి మెప్పించింది. తాజాగా హైదరాబాద్ లో ఓ షాప్ ఓపెనింగ్ కి శోభిత రాగా మీడియాతో మాట్లాడింది. ఓ మీడియా ప్రతినిధి మీపై ఇటీవల వస్తున్న ఓ రూమర్ గురించి ఏమన్నా స్పందిస్తారా అంటూ ఇండైరెక్ట్ గా చైతూ రూమర్స్ గురించి అడిగారు.
Bhavya Bishnoi : IAS ఆఫీసర్ తో నిశ్చితార్థం చేసుకున్న మెహ్రీన్ మాజీ బాయ్‌ఫ్రెండ్..
దీంతో శోభిత దీనికి సమాధానమిస్తూ.. ఇన్ని సినిమాలు చేస్తున్నప్పుడు రూమర్స్ వస్తూనే ఉంటాయి. ఎవరో ఒకరు ఏదో ఒకటి అన్నంతమాత్రాన వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అయినా అలాంటి రూమర్స్ కి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు క్లారిటీ ఇవ్వాలి. ఏదో తప్పు జరిగిపోయింది, అర్జెంట్ గా క్లారిటీ ఇవ్వాలి అనుకోవడానికి నేనేమి తప్పు చేయలేదు. మనం తప్పు చేయనప్పుడు కూల్ గా, కామ్ గా ఉండాలి, మన పని మీద మనం ఫోకస్ చేయాలి అంతే అని తెలిపింది. ఎక్కడా చైతూ పేరు తీయకపోయినా ఇండైరెక్ట్ గా తనపై వస్తున్న రూమర్స్ కి అలాంటిదేమి లేదు, నేనేమి తప్పు చేయలేదు అని క్లారిటీ ఇచ్చింది శోభిత.