Vijay devarakonda : బర్త్ డే బాయ్ విజయ్ దేవరకొండ.. ఈ సారైనా హిట్ కొడతాడా?

ప్రస్తుతానికి విజయ్ శివనిర్వాణతో ఖుషీ మూవీ చేస్తున్నారు. విజయ్, సమంత క్రేజీ కాంబినేషన్లో ఖుషీ మూవీ చేస్తున్నారు. లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపైనే విజయ్ ఆశలు పెట్టుకున్నారు.

Vijay devarakonda : బర్త్ డే బాయ్ విజయ్ దేవరకొండ.. ఈ సారైనా హిట్ కొడతాడా?

Vijay devarakonda wants hit movie for his Career

Vijay devarakonda :  హిట్ ఫ్లాప్ తో సంబందంలేని క్రేజ్ విజయ్ దేవరకొండ సొంతం. సాలిడ్ హిట్ కొట్టి కొన్ని సంవత్సరాలైనా ఈ రౌడీ హీరోకున్న ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు. కెరీర్ స్టార్టింగ్ లో పీక్ కు వెళ్లి మళ్ళీ కెరీర్ ని స్లో డౌన్ చేసుకున్న విజయ్ లైగర్ తర్వాత ఇప్పుడు సినిమాల విషయంలో సెలక్టివ్ గా ఉంటున్నాడు. కాంట్రవర్శీలు కేరాఫ్ అడ్రస్ అయినా కూడా ఏమాత్రం కేర్ చెయ్యని రౌడీ హీరో విజయ్ దేవరకొండ కి ఇప్పుడు డెసిషన్ తీస్కోవాల్సిన హై టైమ్ నడుస్తోంది. 2018 లో వచ్చిన గీతగోవిందం(Geetha Govindam) తర్వాత ఇప్పటి వరకూ సాలిడ్ సక్సెస్ కొట్టని విజయ్ దేవరకొండ నెక్ట్స్ సినిమాలపై, కథలపై, మేకింగ్ పై ఫోకస్ పెట్టాల్సిన టైమొచ్చిందంటున్నారు ఫాన్స్.

2018 నుంచి ఈ 4 సంవత్సరాల్లో విజయ్ 5 సినిమాలు చేశారు. అవి కూడా పెద్ద సినిమాలే. డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ చేసే డైరెక్టర్లతో ప్రయోగాలు చేశారు విజయ్. కానీ ఆ సినిమాలు విజయ్ కెరీర్ కి పెద్ద లాస్ తెచ్చిపెట్టాయి. అందుకే ఈ 4 ఏళ్ల నుంచి ఒక్కటంటే ఒక్క హిట్ లేకుండా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు విజయ్ చేస్తున్న సినిమాలు సరిగ్గా ప్లాన్ చేసకుంటే ట్రాక్ లో పడే చాన్సుందంటున్నారు జనాలు.

ప్రస్తుతానికి విజయ్ శివనిర్వాణతో ఖుషీ మూవీ చేస్తున్నారు. విజయ్, సమంత క్రేజీ కాంబినేషన్లో ఖుషీ మూవీ చేస్తున్నారు. లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపైనే విజయ్ ఆశలు పెట్టుకున్నారు. ఖుషీతో పాటు మరో 2 ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశారు విజయ్. గౌతమ తిన్ననూరి డైరెక్షన్లో సినిమాతో పాటు పరశురామ్ డైరెక్షన్లో మరో ఇంట్రస్టింగ్ మూవీ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఇన్నాళ్లకి డిఫరెంట్ టేకింగ్ ఉన్న డైరెక్టర్లతో పాటు ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న ప్రొడ్యూసర్స్ యాడ్ అవ్వడంతో విజయ్ దేవరకొండ కి హిట్ గ్యారంటీగా వస్తుందని కాన్పిడెంట్ గా ఉన్నారు ఫ్యాన్స్.

Kushi : విజయ్ దేవరకొండ బర్త్ డే గిఫ్ట్.. ఖుషీ ఫస్ట్ సాంగ్ రిలీజ్!

నేడు పుట్టిన రోజు కావడంతో విజయ్ దేవరకొండకి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ బర్త్ డే బాయ్ ఇప్పుడైనా హిట్స్ కొట్టి తన క్రేజ్ ని మరింత పెంచుకుంటాడా చూడాలి.