Prabhas : రాజమౌళికి నాకంటే చరణ్, తారక్‌లే ఎక్కువ

తాజాగా 'రాధేశ్యామ్' ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళితో కలిసి ప్రభాస్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలని తెలియచేసాడు ప్రభాస్. ఈ ఇంటర్వ్యూలో రాజమౌళి ప్రభాస్ ని.....

Prabhas : రాజమౌళికి నాకంటే చరణ్, తారక్‌లే ఎక్కువ

Radheshyam

Rajamouli :  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాతో మార్చ్ 11న రాబోతున్నాడు. ఇవాళ్టి వరకు కూడా ప్రభాస్ ‘రాధేశ్యామ్’ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఎన్నో వాయిదాల అనంతరం సినిమా విడుదల అవుతుండటంతో అభిమానులతో పాటు సినీ ప్రేమికులు కూడా సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రమోషన్స్ లో గత వారం రోజుల నుంచి చిత్ర యూనిట్ బిజీగా ఉంది. ప్రభాస్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

తాజాగా ‘రాధేశ్యామ్’ ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళితో కలిసి ప్రభాస్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలని తెలియచేసాడు ప్రభాస్. ఈ ఇంటర్వ్యూలో రాజమౌళి ప్రభాస్ ని ప్రశ్నలు అడగటమే కాకుండా ప్రభాస్ కూడా రాజమౌళిని ప్రశ్నలు అడిగారు. ఇందులో భాగంగానే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్ చరణ్‌ని, ఎన్టీఆర్‌ని తీసుకున్నావు నన్ను ఎందుకు తీసుకోలేదు? కనీసం గెస్ట్ అప్పీరెన్స్ కూడా ఇవ్వలేదు అని అడిగారు ప్రభాస్. దీనికి సమాధానంగా రాజమౌళి.. ”కథలో అవసరం అనుకుంటేనే తీసుకుంటాను. అది నీకు కూడా తెలుసు. నిన్ను తీసుకెళ్లి ఆ కథలో ఎక్కడ ఇరికించాలి అని నేను ఆలోచించకూడదు. నిజంగా అవసరం అనుకుంటే నేనే అడుగుతాను నిన్ను” అని తెలిపారు.

RRR : ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ మొదలు.. ‘ఎత్తరా జెండా’ అంటున్న ‘ఆర్ఆర్ఆర్’ టీం..

ప్రభాస్ దీనికి రిప్లైగా.. ”అయినా నాకు తెలుసు నీకు నాకంటే చరణ్, తారక్‌లే ఎక్కువ. నా దగ్గర కూడా తారక్ గురించే మాట్లాడతావు. ‘యమదొంగ’ సినిమా టైంలో కూడా తారక్ కోసం ఇంకా కథలు రాశానన్నావు. నీకు వాళ్లిద్దరూ అంటేనే ఇష్టం” అని నవ్వుతూ అన్నాడు ప్రభాస్.