Adipurush Movie : ‘ఆదిపురుష్’లో ప్రభాస్ షూటింగ్ పూర్తి

తాజగా 'ఆదిపురుష్' సినిమా నుంచి అప్ డేట్ వచ్చింది. ముంబైలో సెట్స్ వేసి ఈ సినిమా షూట్ చేస్తున్నారు. అయితే ఇందులో ఎక్కువగా గ్రాఫిక్స్ పార్ట్ ఉండటంతో షూటింగ్ పార్ట్ చాల తక్కువగా ఉంది.

Adipurush Movie :  ‘ఆదిపురుష్’లో ప్రభాస్ షూటింగ్ పూర్తి

Adipurush

Adipurush Movie :  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. వరుస లైనప్ తో ఇప్పటికే 6 పాన్ ఇండియా సినిమాలు అనౌన్స్ చేసి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. ‘రాధేశ్యామ్’ సంక్రాంతి రిలీజ్ కి రెడీగా ఉంది. ‘సలార్’ షూటింగ్ దశలో ఉంది. ‘ఆదిపురుష్’ కూడా షూటింగ్ దశలో ఉంది. మిగిలిన సినిమాలు ప్రీ పొడక్షన్ వర్క్ లో ఉన్నాయి.

Manchu Vishnu : సీనియర్ నటిని ‘మా’ నుంచి బహిష్కరించిన మంచు విష్ణు.. షాక్ లో ‘మా’ సభ్యులు

తాజగా ‘ఆదిపురుష్’ సినిమా నుంచి అప్ డేట్ వచ్చింది. ముంబైలో సెట్స్ వేసి ఈ సినిమా షూట్ చేస్తున్నారు. అయితే ఇందులో ఎక్కువగా గ్రాఫిక్స్ పార్ట్ ఉండటంతో షూటింగ్ పార్ట్ చాల తక్కువగా ఉంది. అందుకే షూటింగ్ త్వరగా పూర్తవుతుంది. ‘ఆదిపురుష్’ సినిమాలో ప్రభాస్ రాముడిగా కృతి సనన్ సీత గా సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా కనిపించబోతున్నారు. ఇప్పటికే ‘ఆదిపురుష్’లో సైఫ్ అలీఖాన్ పార్ట్, కృతీ సనన్ పార్ట్ షూటింగ్ ని పూర్తి చేసిన డైరెక్టర్ ఓంరౌత్ తాజాగా ప్రభాస్‌ షూటింగ్ పార్ట్‌ని పూర్తి చేశాడు.

Mega Family : మెగా – అల్లు ఫ్యామిలీల దీపావళి

దీంతో ముంబైలోని సెట్‌లో కేక్ కట్ చేసి చిత్ర యూనిట్ వేడుకను జరుపుకుంది. ప్రభాస్ షూటింగ్ పార్ట్‌ పూర్తి చేయడంతో, బ్యాలెన్స్ టాకీ పార్ట్‌లను నవంబర్‌లో తీయనున్నారు. ఆ తర్వాత నుంచి వీఎఫ్‌ఎక్స్ పనుల్లో చిత్ర యూనిట్ బిజీగా ఉంటుంది. ఈ సినిమాని వచ్చే ఏడాది ఆగస్ట్ 11న రిలీజ్ చేస్తామని ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించారు.