Prabhas: ప్రభాస్ కోసం ఆమెను పట్టుకొస్తున్నారా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ ఇండియాలోనే బిజీ స్టార్‌గా మారిపోయాడు. ఇప్పటికే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావుత్ దర్శకత్వంలో.....

Prabhas: ప్రభాస్ కోసం ఆమెను పట్టుకొస్తున్నారా..?

Prabhas To Romance Kareena Kapoor In Spirit

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ ఇండియాలోనే బిజీ స్టార్‌గా మారిపోయాడు. ఇప్పటికే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావుత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమాను రెడీ చేస్తున్న ప్రభాస్, ఆ తరువాత కేజీయఫ్, కేజీయఫ్-2 వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ‘సలార్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుపుకుంటోంది.

Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌లో టెన్షన్.. ఎందుకో తెలుసా?

ఇక ఈ సినిమాలతో పాటు ప్రభాస్ తన నెక్ట్స్ చిత్రం ‘ప్రాజెక్ట్-K’ను కూడా స్టార్ట్ చేశాడు. ఈ సినిమాను నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తుండగా, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా, ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కించేందుకు ప్రభాస్ రెడీ అయ్యాడు. ఈ సినిమాకు ‘స్పిరిట్’ అనే టైటిల్‌ను కూడా చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ సినిమాలో ప్రభాస్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తాడని చిత్ర యూనిట్ టైటిల్ పోస్టర్‌లోనే చెప్పేసింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది.

Prabhas : మరో ప్రాజెక్టుకి లైన్ క్లియర్ చేసిన ప్రభాస్.. ఈ లైనప్ ఏంటి బాబు..

ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా ఎవరిని తీసుకోవాలా అని చిత్ర యూనిట్ తెగ సతమతమయ్యిందట. అయితే ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్న చిత్ర యూనిట్, ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలని చూస్తుందట. పెళ్లయ్యి ఇద్దరు పిల్లల తల్లైనా కూడా కరీనా కపూర్ బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ బిజీగా మారింది. దీంతో ఆమె అయితే ప్రభాస్ సరసన పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుందని సందీప్ రెడ్డి వంగా భావిస్తున్నాడట. అంతేగాక, ఈ సినిమాలో నటించాల్సిందిగా ఆమెను సంప్రదించగా, ఆమె భారీ మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. మరి ఈ సినిమాలో నిజంగానే ఈ బాలీవుడ్ బ్యూటీని పట్టుకొస్తారా లేక వేరొక హీరోయిన్‌ను సెలెక్ట్ చేస్తారా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.