Prakash Raj : మహేష్ బాబు సినిమాలో ఆ పాత్రని నచ్చకుండానే చేయాల్సి వచ్చింది..

ప్రకాష్ రాజ్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''ఏ ఆర్టిస్టుకైనా ఒక్కొక్కసారి నచ్చని పాత్రలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. నాకు అలాంటి పాత్రల్లో ఇటీవల మహేష్ బాబు సినిమా..............

Prakash Raj : మహేష్ బాబు సినిమాలో ఆ పాత్రని నచ్చకుండానే చేయాల్సి వచ్చింది..

Prakash Raj

Prakash Raj :  ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు రకాల పాత్రలని పోషించిన ప్రకాష్ రాజ్ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎలాంటి పాత్ర అయినా ఇట్టే ఒదిగిపోయి చేసేస్తూ తన బెస్ట్ ఇస్తారు. కొన్ని వందల సినిమాల్లో ఎన్నో రకాల పాత్రలతో అందర్నీ మెప్పించారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకి నచ్చకుండానే కొన్ని పాత్రలు చేయాల్సి వస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మహేష్ బాబు సినిమాలో అలాగే చేయాల్సి వచ్చిందని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

ప్రకాష్ రాజ్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ”ఏ ఆర్టిస్టుకైనా ఒక్కొక్కసారి నచ్చని పాత్రలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. నాకు అలాంటి పాత్రల్లో ఇటీవల మహేష్ బాబు సినిమా ‘సరిలేరును నీకెవ్వరు’లో నేను చేసిన పాత్ర ఒకటి. ఆ సినిమాలో అబద్ధాలు చెప్పే రాజకీయనాయకుడి పాత్ర పోషించాను. ఆ పాత్ర నాకు ఇష్టం లేకున్నా చేయాల్సి వచ్చింది. నటులకు కొన్ని సార్లు వారి నిర్ణయాలతో పనిలేకుండా అలా జరిగిపోతూ ఉంటుంది. గతంలో కూడా అలా ఇష్టం లేకుండానే పలు పాత్రలు చేయాల్సి వచ్చింది. కొన్ని మొహమాటానికి ఒప్పుకోవాల్సి వస్తుంది” అని తెలిపారు.

Rithu Chowdary : బుల్లితెర స్టార్ ప్రేమలో పడింది.. సోషల్ మీడియాలో బాయ్ ఫ్రెండ్‌తో రచ్చ..

ఇక ఇటీవల ‘మేజర్’ సినిమాలో చేసిన పాత్ర తనకు బాగా సంతృప్తి ఇచ్చిందన్నారు. ఇప్పటివరకు తన కెరీర్ లో ‘ఆకాశమంత’, ‘బొమ్మరిల్లు’ సినిమాలలోని క్యారెక్టర్స్ ది బెస్ట్ అని చెప్పారు ప్రకాష్ రాజ్.