Priyanka Chopra: పేరు చివర భర్త పేరు తొలగింపు.. పీసీ రియాక్షన్ ఇదే

బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా తనకంటే పదేళ్లు చిన్నవాడైన ప్రముఖ పాప్‌సింగర్‌ నిక్ జోనాస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ కెరీర్ పీక్స్..

Priyanka Chopra: పేరు చివర భర్త పేరు తొలగింపు.. పీసీ రియాక్షన్ ఇదే

Priyanka Chopra

Priyanka Chopra: బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా తనకంటే పదేళ్లు చిన్నవాడైన ప్రముఖ పాప్‌సింగర్‌ నిక్ జోనాస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే హాలీవుడ్ ఆఫర్లను పట్టేసి అక్కడే భర్తను కూడా పట్టేసిన పీసీ ఇప్పుడు హాలీవుడ్ టూ బాలీవుడ్ కెరీర్ మరింత పరుగులు పెట్టించేస్తుంది. అయితే, ఈ మధ్య పీసీ భర్త జోనాస్ నుండి విడిపోనుందని.. ఈ ఇద్దరూ విడాకులు తీసుకోనున్నారని దుమారం రేగిన సంగతి తెలిసిందే.

Bangarraju: సంక్రాంతికి ఉన్నట్లా.. లేనట్లా? టెన్షన్ పెట్టేస్తున్న అక్కినేని హీరోలు!

పీసీ-జోనాస్ విడాకుల రూమర్లకు కారణం ఇన్ స్టాగ్రామ్ ఖాతా. పీసీ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా నుండి జోనాస్ పేరును తొలగించి కేవలం తన పేరును మాత్రమే ఉంచింది. దీంతో ఈ ఇద్దరి మధ్య విడాకులేనని ప్రచారం జరిగిపోయింది. పీసీ-జోనాస్ విడాకులంటూ ఎంత ప్రచారం జరిగినా ఈ కామెంట్లపై ప్రియాంక గానీ, నిక్‌ కానీ స్పందించలేదు. కాగా, తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రియాంకకు ఈ ప్రశ్న ఎదురవడంతో పీసీ తప్పక ఆన్సర్ చేయాల్సి వచ్చింది.

Gopichand 30: మ్యాచోస్టార్ మొదలు పెట్టేస్తున్నాడు.. హ్యాట్రిక్ కొడతారా?

‘నా ట్విటర్ హాండిల్‌కు ఉండే పేరే ఇన్‌స్టాకు కూడా ఉండాలని మార్చాను తప్ప అంతకుమించి ఏం లేదు. అయినా ఇలాంటివి కూడా జనాలకు పెద్ద విషయాలుగా కనిపించడం చూస్తే నవ్వొస్తుంది. ఇది జస్ట్ సోషల్ మీడియా.. జస్ట్ చిల్ అవుట్’ అంటూ సింపుల్ గా తేల్చేసింది పీసీ. మరి ప్రియాంకా భర్త ఇంటి పేరు తొలగించడంపై వచ్చిన వదంతులకు పుల్‌స్టాప్‌ పడుతుందా లేక ఇది ఇప్పట్లో ఆగేది కాదో చూడాలి.