Gopichand 30: మ్యాచోస్టార్ మొదలు పెట్టేస్తున్నాడు.. హ్యాట్రిక్ కొడతారా?

మ్యాచోస్టార్ గోపీచంద్ మరో క్రేజీ కాంబినేషన్ లో సినిమా మొదలు పెడుతున్నాడు. గోపీచంద్ కెరియర్ లో లక్ష్యం సినిమా ముమ్మాటికీ భారీ సక్సెస్ సినిమానే. అనుష్క, జగపతి బాబు, కోటా శ్రీనివాస్..

Gopichand 30: మ్యాచోస్టార్ మొదలు పెట్టేస్తున్నాడు.. హ్యాట్రిక్ కొడతారా?

Gopichand 30

Updated On : December 22, 2021 / 2:48 PM IST

Gopichand 30: మ్యాచోస్టార్ గోపీచంద్ మరో క్రేజీ కాంబినేషన్ లో సినిమా మొదలు పెడుతున్నాడు. గోపీచంద్ కెరియర్ లో లక్ష్యం సినిమా ముమ్మాటికీ భారీ సక్సెస్ సినిమానే. అనుష్క, జగపతి బాబు, కోటా శ్రీనివాస్ రావు లాంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాకి ఇప్పటికే టీవీల్లో అదే ఆదరణ దక్కించుకుంటుంది. ఆ సినిమాతోనే శ్రీవాస్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఈ కాంబినేషన్ లో లౌక్యం అనే మరో సినిమా కూడా రాగా.. అప్పటికే వాంటెడ్, మొగుడు లాంటి ప్లాపులలో ఉన్న గోపీచంద్ కు లౌక్యం రిలీఫ్ ఇచ్చింది.

Hollywood Movies: ఇండియాలో హాలీవుడ్ హవా.. బాక్సాఫీస్ వద్ద భళా!

కాగా, ఇప్పుడు ఈ కాంబినేషన్ లో మూడవ సినిమా మొదలవుతుంది. గోపీచంద్‌ కెరీర్‌లో ఇది 30వ సినిమా కాగా పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. భూపతిరాజా కథ విన్న గోపీచంద్‌ వెంటనే ఒకే చెప్పగా దర్శకుడు శ్రీవాస్‌తో మరోసారి అసోసియేట్‌ అవుతుండడంతో ఈ సినిమా మీద ఆసక్తి నెలకొంది. ఈ క్రేజీ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా ఈ నెల 24న మొదలవుతుంది. గతంలో ఈ సినిమా ప్రకటనతో పాటు విడుదల చేసిన పోస్టర్ చూసే కోల్‌కత్తా బ్యాక్ డ్రాప్ లో సాగే కథగా కనిపిస్తుంది.

Bollywood Sequels: పార్టుల మీద పార్టులు.. బాలీవుడ్‌లో సీక్వెల్స్ హవా!

పోస్టర్ లో హౌరా బ్రిడ్జితో పాటు ప్రజలు గూమికూడి ట్రాఫిక్‌తో ఉన్న కోల్‌కత్తాలో ఫేమస్‌ కాళీమాత విగ్రహం కనిపిస్తున్నాయి. ఈ అంశాలు గోపీచంద్, శ్రీవాస్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై మరిన్ని అంచనాలను క్రియేట్‌ చేస్తున్నాయి. అలాగే ఈ సినిమా కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో మరింత ఆసక్తికరంగా సాగుతుందని తెలుస్తుంది. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమా టైటిల్‌ ఖరారు కావాల్సి ఉంది. మరి ఈ కాంబినేషన్లో వస్తున్న ఈ హ్యాట్రిక్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొడతారా లేదా అన్నది చూడాల్సి ఉండగా ప్రస్తుతం గోపీచంద్ మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌‘పక్కా కమర్షియల్‌’ సినిమాతో బిజీగా ఉన్నాడు.