Avatar 2: ‘అవతార్-2’పై టాలీవుడ్ ప్రొడ్యూసర్ కామెంట్స్.. డాక్యుమెంటరీ అదిరిందట!

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ది మోస్ట్ ప్రెస్టీజియస్ విజువల్ వండర్ మూవీ ‘అవతార్-2’ ఎట్టకేలకు నేడు థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఈ సినిమా పలు సెన్సేషనల్ రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాను చూసిన వారు నోరెళ్లబెడుతూ థియేటర్ల నుంచి బయటకు వస్తున్నారు.

Avatar 2: ‘అవతార్-2’పై టాలీవుడ్ ప్రొడ్యూసర్ కామెంట్స్.. డాక్యుమెంటరీ అదిరిందట!

Producer Naga Vamsi Comments On Avatar-2 Goes Viral

Avatar 2: ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ది మోస్ట్ ప్రెస్టీజియస్ విజువల్ వండర్ మూవీ ‘అవతార్-2’ ఎట్టకేలకు నేడు థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఈ సినిమా పలు సెన్సేషనల్ రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాను చూసిన వారు నోరెళ్లబెడుతూ థియేటర్ల నుంచి బయటకు వస్తున్నారు.

Avatar 2 : ఇండియాలో RRR, KGF రికార్డులను కొల్లగొట్టిన అవతార్..

అయితే ఈ సినిమాపై టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాత నాగవంశీ తనదైన రివ్యూ ఇచ్చారు. తాజాగా ఆయన అవతార్-2 సినిమాపై చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ‘‘జేమ్స్ కామెరూన్ ఓ మరైన్ బయోలజీ డాక్యుమెంటరీని చూడాల్సిందిగా ఆర్డర్ వేశారు.. ఇది 3D కావడం.. ఆయన తెరకెక్కించడంతో ‘విజువల్ వండర్’ అని అంటున్నారు. ఈ సినిమాను చూశాక మాస్టర్‌క్రాఫ్ట్, బ్లాక్‌బస్టర్ వంటి పదాలే అనాలి.. లేకపోతే నావీ ఒప్పుకోదు’’ అంటూ వ్యంగ్యంగా ఈ సినిమాపై రివ్యూ ఇచ్చారు.

Avatar 2: ఆన్‭లైన్‭లో అవతార్-2 ఫుల్ మూవీ.. విజువల్ వండర్‌కు పైరసీ ఎఫెక్ట్!

కాగా 13 ఏళ్ల తరువాత అవతార్-2 సినిమా రావడంతో ప్రేక్షకుల్లో మెజారిటీ శాతం ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కానీ, ఈ సినిమాలో మొదటి పార్ట్‌లో ఉన్న క్యూరియాసిటీ మిస్ అయ్యిందని పలువురు సినీ క్రిటిక్స్ సైతం అంటున్నారు. దీంతో పలువురు నెటిజన్లు కూడా నాగవంశీ ట్వీట్‌కు సపోర్ట్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం ఇలాంటి అద్భుతమైన విజువల్ వండర్ మూవీని డాక్యుమెంటరీతో పోల్చడం ఏమిటని ఆయన్ను ప్రశ్నిస్తున్నారు.