SSMB28 : SSMB28 మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నిర్మాత నాగవంశీ..

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ మరో చిన్న సినిమా 'బుట్టబొమ్మ'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దీంతో చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే నిర్మాత నాగవంశీ, అనిఖా సురేంద్రన్.. యాంకర్ సుమకు ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో నాగవంశీ SSMB28 గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. మహేష్ బాబు గారి సినిమా గురించి ఫ్యాన్స్ కి ఏమన్నా అప్డేట్ ఇవ్వచ్చు కదా అని సుమ అడిగింది.

SSMB28 : SSMB28 మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నిర్మాత నాగవంశీ..

ssmb28

SSMB28 : టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ మరో చిన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘బుట్టబొమ్మ’. శౌరీ చంద్రశేఖర్ టి రమేష్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. అనిఖా సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ఠ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గోపి సుందర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టింది.

Mahesh Babu: సంక్రాంతి బరిలో మహేష్ సినిమా.. వారం ముందే ల్యాండ్ అవుతున్న బాబు!

ఈ క్రమంలోనే నిర్మాత నాగవంశీ, అనిఖా సురేంద్రన్.. యాంకర్ సుమకు ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో నాగవంశీ SSMB28 గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. మహేష్ బాబు గారి సినిమా గురించి ఫ్యాన్స్ కి ఏమన్నా అప్డేట్ ఇవ్వచ్చు కదా అని సుమ అడిగింది. దీనికి బదులిస్తూ.. ‘SSMB28 రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 18 నుంచి మొదలు కానుంది. ఈ ఏడాది ఆగష్టు 11న సినిమాని విడుదల చేస్తాం’ అంటూ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేసేశాడు నాగవంశీ.

అలాగే మూవీలో హీరోయిన్స్ గా ఎవరు యాక్ట్ చేస్తున్నారు అనేది కూడా తెలియజేశాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్దే చేస్తున్న సంగతి తెలిసిందే. మేము ప్రకటించకుండానే సెకండ్ హీరోయిన్ గా ‘శ్రీలీల’ని తీసుకున్నట్లు. మళ్ళీ ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అవి ఏవి నిజం కాదు. ఈ సినిమా కోసం శ్రీలీలని తీసుకున్న సంగతి నిజమే కానీ ఆమె తప్పుకుంది అనేది అబద్ధం. ఈ సినిమాలో ఆమె మరో హీరోయిన్ గా చేస్తున్న సంగతి నిజమే కానీ ఆమె సెకండ్ హీరోయిన్ అనేది అబద్ధం. ఈ మూవీలో ఇద్దరి హీరోయిన్ లకు సమానమైన ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఫస్ట్, సెకండ్ హీరోయిన్లు అనేది లేదు. ఇద్దరు మహేష్ బాబు పక్కన ఈక్వల్ గా నటిస్తారు.