Mahesh Babu: సంక్రాంతి బరిలో మహేష్ సినిమా.. వారం ముందే ల్యాండ్ అవుతున్న బాబు!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్‌లోని 28వ చిత్రానికి సంబంధించిన రెండో షెడ్యూల్ షూటింగ్‌ను స్టార్ట్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తుండగా, పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీగా ఈ సినిమా రానుంది. ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్‌లోని 28వ చిత్రానికి సంబంధించిన రెండో షెడ్యూల్ షూటింగ్‌ను స్టార్ట్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తుండగా, పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీగా ఈ సినిమా రానుంది. ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
Allu Arjun – Mahesh Babu : ఒకే వేదికపై సూపర్ స్టార్, ఐకాన్ స్టార్..
ఇక ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకముందే, మహేష్ సంక్రాంతి బరిలో తన చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యాడు. మహేష్ ఏ సినిమా చేశాడు.. సంక్రాంతి నాటికి అది రిలీజ్ ఎలా అవుతుందని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అయితే మహేష్ గతంలో నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఒక్కడు’ రిలీజ్ అయ్యి 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ సినిమాను రీ-రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. సంక్రాంతి బరిలో ఇప్పటికే పలు సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉండటంతో, పండగకు వారం ముందు.. అంటే జనవరి 7న ఒక్కడు సినిమాను రీరిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
Mahesh Babu : రియల్ లైఫ్‌లోను ‘బిజినెస్ మేన్’ అనిపించుకుంటున్న మహేష్ బాబు..
దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో మహేష్ పర్ఫార్మెన్స్కు ప్రేక్షకులు పట్టం కట్టారు. ఇక ఈ సినిమాలో అందాల భామ భూమికా చావ్లా హీరోయిన్గా నటించగా, ప్రకాశ్ రాజ్ విలన్ పాత్రలో నటించాడు. ఈ సినిమాకు మణిశర్మ తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశాడు. మొత్తంగా ఈ సంక్రాంతికి మహేష్ బాబు ఫ్యాన్స్‌కు సందడి మాత్రం ఖాయం అని ఈ చిత్ర యూనిట్ అంటోంది. మరి ఒక్కడు రీ-రిలీజ్‌కు ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.