Mahesh Babu : రియల్ లైఫ్‌లోను ‘బిజినెస్ మేన్’ అనిపించుకుంటున్న మహేష్ బాబు..

సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ రంగంలో ఒక పక్క నటుడిగా నటిస్తూనే.. సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ, కమర్షియల్ యాడ్స్ చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇది ఒక పక్క అయితే, మరోపక్క వ్యాపార రంగంలోను సూపర్ స్టార్ అనిపించుకుంటున్నాడు. ఇప్పటికే థియేటర్స్, క్లాతింగ్ బిజినెస్‌లో ప్రవేశించి రీల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లోను బిజినెస్ మేన్ లా నిలుస్తున్నాడు.

Mahesh Babu : రియల్ లైఫ్‌లోను ‘బిజినెస్ మేన్’ అనిపించుకుంటున్న మహేష్ బాబు..

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ రంగంలో ఒక పక్క నటుడిగా నటిస్తూనే.. సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ, కమర్షియల్ యాడ్స్ చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇది ఒక పక్క అయితే, మరోపక్క వ్యాపార రంగంలోను సూపర్ స్టార్ అనిపించుకుంటున్నాడు. ఇప్పటికే థియేటర్స్, క్లాతింగ్ బిజినెస్‌లో ప్రవేశించి రీల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లోను బిజినెస్ మేన్ లా నిలుస్తున్నాడు.

Mahesh – Rajamouli Film : జూన్‌లో షూటింగ్.. రాజమౌళి-మహేష్ సినిమాపై విజయేంద్రప్రసాద్ వ్యాఖ్యలు..

తాజాగా ఫుడ్ బిజినెస్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఏషియన్ సంస్థతో కలిసి AMB సినిమాస్ స్టార్ట్ చేసిన మహేష్.. ఇప్పుడు అదే ఏషియన్ గ్రూప్స్ తో కలిసి ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేస్తున్నాడు. AN రెస్టారెంట్ అనే పేరుతో ఈ నెల 8న నుండి అందుబాటులోకి రానున్న ఈ రెస్టారెంట్ కు భార్య నమ్రతా పేరుని పెట్టాడు మహేష్ బాబు. ‘AN’లో N అంటే నమ్రతా.ఈ రెస్టారెంట్ హైదరాబాద్ బంజారా హిల్స్‌లోని టీఆర్ఎస్ భవనం పక్కన ఉంది.

ఇక మహేష్ సినిమా విషయానికి వస్తే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB28 చిత్రం షూటింగ్ మొదలు పెట్టుకొని మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్నప్పటికీ, రెండో షెడ్యూల్ మొదలుపెట్టడానికి అనేక సమస్యలు ఎదురవుతున్నారు. ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ లో ఉన్న చిత్ర యూనిట్, త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టి.. హైదరాబాద్ శివార్లలోని ఖాన్‌పూర్‌లో చిత్రీకరణ జరుపుకొనునట్లు తెలుస్తుంది.