Allu Arjun – Mahesh Babu : ఒకే వేదికపై సూపర్ స్టార్, ఐకాన్ స్టార్..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లకు ఎంతటి ఫాలోయింగ్ ఉందో సపరేట్ గా ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇంతటి స్టార్‌డమ్ ఉన్న హీరోలను ఒకే వేదికపై చూడడం చాలా అరుదు. అలాంటిది అల్లు అర్జున్, మహేష్ బాబు ఇవాళ ఒకే ఫ్రేమ్ లో కనిపించి సందడి చేశారు.

superstar and icon star on the same stage
Allu Arjun – Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లకు ఎంతటి ఫాలోయింగ్ ఉందో సపరేట్ గా ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ నటనతో, సినిమా కథల ఎంపికలతో అశేషమైన ప్రజాధారణ సంపాదించుకున్నారు. అంతేకాదు తెలుగు సినీపరిశ్రమని తమ సినిమాలతో ప్రపంచానికి పరిచయం చేస్తూ.. టాలీవుడ్ లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.
ఇక ఇంతటి స్టార్‌డమ్ ఉన్న హీరోలను ఒకే వేదికపై చూడడం చాలా అరుదు. అలాంటిది అల్లు అర్జున్, మహేష్ బాబు ఇవాళ ఒకే ఫ్రేమ్ లో కనిపించి సందడి చేశారు. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ కూతురు పెళ్లి రిసెప్షన్ నేడు హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మహేష్ బాబు, అల్లు అర్జున్ హాజరయ్యారు. ఈ క్రమంలోనే వేదికపై ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తూ ఫోటోలు దిగారు.
ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. కాగా మహేష్ బాబు గతంలో గుణశేఖర్ దర్శకత్వంలో ‘ఒక్కడు’, ‘సైనికుడు’ వంటి సినిమాల్లో నటించాడు. అల్లు అర్జున్ ‘వరుడు’ సినిమాని గుణశేఖర్ తెరకెక్కించగా.. ప్రెజెంట్ ఈ దర్శకుడు తెరకెక్కిస్తున్న మైథలాజికల్ మూవీ ‘శాకుంతలం’ సినిమాతో అల్లు అర్జున్ కూతురు ‘అర్హ’ వెండితెర అరంగేట్రం చేస్తుంది.
#MaheshBabu and #AlluArjun together at #Gunasekhar‘s daughter @neelima_guna wedding reception today.@Gunasekhar1 @GunaaTeamworks pic.twitter.com/DRVkSZYNLG
— Sreedhar Sri (@SreedharSri4u) December 11, 2022